Marlawai Village | జైనూర్, ఆగస్టు 30 : జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామం అంటేనే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశంలో పలుసార్లు ఆదర్శ గ్రామంగా అవార్డులు తీసుకున్న గ్రామం. అయితే ఈ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గత 20 రోజుల క్రితం మార్లవాయి గ్రామంలో పర్యటించినప్పటికి అక్కడున్న సమస్యల పరిష్కారానికి నేటికి నోచుకోవడం లేదు.
అధ్వానంగా మారిన రోడ్ల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుండెబ్బ మండల అధ్యక్షుడు మధురాజ్ మడావి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాలకు రోడ్లు దెబ్బతినడం, గుంతలు ఏర్పడటం, బురదమయం అవ్వడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు ఇలా అద్వాన్నంగా తయారవుతున్నాయని మధురాజ్ మడావి మండిపడ్డారు.
అయితే ఈ గ్రామమే కాకుండా ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పలు ఆదివాసి ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధాన మార్గాలు ఇలా పలు రోడ్లు గుంతలమయంగా మారడమే కాకుండా వర్షపు నీటితో కరిగెటను తలపిస్తున్నాయి. దీంతో రోడ్డు మార్గాల్లో రాకపోకల సమయంలో వాహన చోదకులు, పాదచారులకు కిందపడి గాయాలు అవుతున్నాయని పట్టణవాసులు ఆవేదన చెందుతున్నారు. అసలు ఇది ఆదర్శ గ్రామమేనా? అని కొత్తగా వచ్చే వారు ముక్కున వేలేసుకోవడంతోపాటు అధికారుల తీరుపై తీవ్రంగా మండి పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంతర్గత రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకొని గ్రామస్తుల ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు.
Harish Rao | పెట్రోల్‌కు రేవంత్ డబ్బులు ఇస్తున్నాడా..? పోలీసులకు హరీశ్‌రావు సూటి ప్రశ్న
పార్టీ మారితేనే సహకారం.. లేదంటే తిరస్కారం..