Kubeer Junctions | కుభీర్, ఆగస్టు 24 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని పలు కూడళ్లు ఐమాస్డ్ విద్యుత్ లైట్లు వెలగకపోవడంతో అంధకారంలో మగ్గుతున్నాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు, కాలినడకన వెళ్లే గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు పలుమార్లు ఈ విషయమై అధికారులకు విన్నవించినా మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. ఏడాది గడిచిపోతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
కుభీర్-భైంసా రహదారిలోని వివేకానంద ప్రధాన కూడళిలో సుమారు 10 గ్రామాలకు చెందిన ప్రయాణికులు, వాహనదారులు రాత్రి వేళల్లో
ఇక్కడినుండే వారి వారి గ్రామాలకు వెళుతుంటారు. ఈ చౌకు చిమ్మ చీకట్లను కమ్ముకోగా ఇక్కడ బస్సు దిగిన పలువురు ప్రయాణికులు కుక్కల దాడులకు గురయ్యారు. ఈ చౌక్‌లో వందలాది కుక్కలు సంచరిస్తుంటాయి. దీంతో పలువురు ప్రయాణికులను కుక్కలు దాడి చేసి కరిచిన సంఘటనలు ఉన్నాయి.
మహిళలు ఈ చౌక్‌లో బస్సు దిగాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. కస్ర, కస్ర తాండ, తండా పార్డి, పార్డి కే తండా, పల్సి పల్సి తండాల ప్రజలతోపాటు కుభీర్ లోని సేవాలాల్ నగర్, వివేకానంద చౌక్ ప్రజలకు ఈ లైట్లు వెలగక చీకటిమయంలో చౌక్‌కు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించి హైమాస్డ్ లైట్లకు మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు ప్రయాణికులకు సౌకర్యం కల్పించాలని మండల వాసులు కోరుతున్నారు.
Read Also :
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?