ఉట్నూర్ రూరల్, జూన్ 24 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన బాలికల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు వసతిగృహ సంక్షేమ అధికారిని శిరీష మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, ఒకేషనల్ కోర్సులు చేసిన బాలికలు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు కుల, ఆదాయ, ఆధార్, బోనఫైడ్, బ్యాంకు ఖాతా, రెండు పాస్ ఫొటోలతో పని దినాలలో సంప్రదించాలని అన్నారు. ఇతర వివరాలకు 9381629216 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Rinku Singh: రింకూ సింగ్ పెళ్లి వాయిదా..