Niranjan Reddy | కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? : నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | కాంగ్రెస్ రైతు పండుగ సంబురాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
Niranjan Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ రైతు పండుగ సంబురాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ రైతు పండగ సంబరాలు ఎందుకోసం? రైతు భరోసా నాలుగు విడతలు ఎగ్గొట్టినందుకా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తాం.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి రూ.12 వేలకు కుదించి.. అది కూడా ఇవ్వనందుకా? అని నిలదీశారు.
రూ.2 లక్షలు రుణమాఫీ అని చెప్పి అరకొర చేసి ఎగ్గొట్టినందుకా? ఏ కారణం చేత రైతు మరణించినా ఆ కుటుంబానికి ధీమాగా ఉండాలని రూ.5 లక్షల సాయం అందించే రైతుబీమా రాకుండా చేసినందుకా? ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో దాదాపు 550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా? వానాకాలం పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ బకాయిలు ఎగ్గొట్టినందుకా? యాసంగి పంటకు క్వింటాలుకు రూ.500 అసలు బోనస్ ఇవ్వనందుకా? కల్లాలకు వచ్చిన ధాన్యం నెలల తరబడి కొనకుండా కండ్ల ముందు అకాల వర్షాల పాలయ్యేలా చేసి కన్నీళ్లు పెట్టించినందుకా? కల్లాల్లో ధాన్యం ఉండగానే వాటిని కొనకుండా కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినందుకా? పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసం నింపుకుని ఆత్మస్థైర్యంతో ఉన్న రైతులను కేవలం 18 నెలల పాలనతో నిండా ముంచి, వ్యవసాయం నడ్డి విరిచినందుకా? అని ప్రశ్నించారు.
లగచర్ల రైతులను జైలుకు పంపినందుకా? పెద్ద ధన్వాడ రైతులకు బేడీలు వేసినందుకా? ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ లాగా ఒక్క పథకం అయినా ప్రవేశపెట్టారా? కోటి 50 లక్షల ఎకరాలకు నాలుగు విడతల్లో ఎకరాకు రూ.30 వేల చొప్పున ఈ ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టింది. నాలుగు విడతలుగా ఎగ్గొట్టిన రైతు భరోసా స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు అన్న భయంతో అయినా రైతు భరోసా వేస్తున్నారని.. సచ్చినోని పెళ్లికి వచ్చిందే కట్నం అని రైతులు సరిపెట్టుకుంటున్నారు తప్ప సంబరాలు చేసుకోవడం లేదు. నాలుగు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పండగ పేరుతో సంబరాలు చేయాలి అనడాన్ని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

