న్యూఢిల్లీ: భారత క్రికెటర్ రింగూ సింగ్.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్.. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరి పెళ్లి నవంబర్ 19వ తేదీన జరగాల్సి ఉంది. కానీ ఆ పెళ్లి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇటీవల లక్నోలో చాలా గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ సెర్మనీ జరిగింది. ఆ వేడుకకు మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, నటి జయా బచ్చన్, భువనేశ్వర్ హాజరయ్యారు.
ఓ హిందీ పత్రిక ప్రకారం.. నవంబర్‌లో క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉన్న కారణంగా.. రింకూ తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరువురికి చెందిన కుటుంబాలు ఆ వాయిదాకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రింకూ, సరోజ్ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయి. తుది తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
పెళ్లి కోసం వారణాసిలోని తాజ్ హోటల్‌ను తొలుత బుక్ చేసుకున్నారు. కానీ క్రికెట్ కమిట్మెంట్ వల్ల ఆ పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఆ హోటల్‌ను ఇప్పుడ ఫిబ్రవరి చివరినాటికి బుక్ చేసుకున్నారు. జూన్ 8వ తేదీన ఇద్దరి మధ్య రింగ్ సెర్మనీ జరిగింది.టీ20 స్పెషలిస్టు రింకూ.. ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడుతాడు. ప్రియా సరోజ్ .. ఎస్పీ టికెట్‌పై మచిలీషహర్ నుంచి గెలుపొందారు.