Anna Bhau Sathe | నార్నూర్, ఆగస్టు 30 : ప్రపంచంలోనే గొప్ప సాహితీవేత్త అన్న బావ్ సాటే అని సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ గజానంద్ నాయక్ ప్రశంసించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో అన్నా బావ్ సాటే ఒక 105వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాహిత్య సామ్రాట్ అన్న బావ్ సాటే విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించి… జెండాను ఎగిరేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నా బావ్ సాటే రచించిన రచనలు దేశ విదేశాలలో ప్రజాఆదరణ పొందాయన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ఆయన సేవలను గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలు కలిసికట్టుగా అన్నాభావ్ సాటే ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నార్నూర్ సీఐ ప్రభాకర్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, దళిత అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే, అన్నా బావ్ సాటే కమిటీ మండల అధ్యక్షుడు, దళిత అవార్డు గ్రహీత కోరల మహేందర్, అఖిల భారతీయ బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ రెడ్డి నాయక్, మాజీ జెడ్పిటిసి రూపావంతి జ్ఞానోబా పుష్కర్, పెద్దలు దిగంబర్, సయ్యద్ ఖాసిం, విలాస్, రాజు, సునీల్, రాము తదితరులున్నారు.
Ear Wax Cleaning | చెవుల్లో ఉండే గులిమిని తొలగించేందుకు ఈ సహజసిద్ధమైన చిట్కాలను పాటించండి..!
Rahul portrait burnt | కాంగ్రెస్ ఆటలు సాగడం లేదని అపనిందలు.. రాహూల్ గాంధీ చిత్రపటం దహనం
Free mega medical camp | కోటగిరి లో ఉచిత మెగా వైద్య శిబిరం.. ప్రజల నుంచి విశేష స్పందన