న్యాల్కల్, జూలై 9 : మండలంలోని డప్పూర్ గ్రామంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రవీందర్, సర్పంచ్ రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదలకు దుప్పట్లు అందజేసి స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సిద్ధమ్మ, ఉప సర్పంచ్ అశోక్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు మల్లన్న, నాయకులు పాల్గొన్నారు.
జహీరాబాద్‌లో..
జహీరాబాద్, జూలై 9 : ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే మాణిక్‌రావును టీఆర్ఎస్ నాయకులు కలిసి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. జహీరాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఝరాసంగంలో..
ఝరాసంగం, జూలై 9 : ఎమ్మెల్యే మాణిక్‌రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం టీఆర్ఎస్ నాయకులు ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో పార్వతీ సమేత సంగమేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి పేదలకు చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, కేతకీ ఆలయ చైర్మన్ వెంకటేశ్వంగుప్తా, ఆలయ ఈవో మోహన్‌రెడ్డి, ఎంపీటీసీలు విజేందర్‌రెడ్డి, రాజు, టీఆర్ఎస్ మండల, గ్రామ అధ్యక్షులు సంగమేశ్వర్, ఎజాజ్బాబా, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సుభాశ్‌రావు, కేతకీ ఆలయ పాలక మండలి సభ్యులు నాగన్న పటేల్, సిద్దన్న పటేల్, టీఆర్ఎస్ నాయకులు సంజీవ్, రాచయ్యస్వామి, హనుమన్న పటేల్, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.