ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Adilabad - Jan 17, 2021 , 01:34:12

25 లోగా శానిటైజేషన్‌ పూర్తవ్వాలి

25 లోగా శానిటైజేషన్‌ పూర్తవ్వాలి

  • ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ 
  • అధికారులతో సమీక్ష

ఎదులాపురం, జనవరి 16 : విద్యాసంస్థ్ధల పునః ప్రారంభ సమయంలో కొవిడ్‌ నిబంధన లు పాటించాలని, విద్యాసంస్థల్లో శానిటైజేషన్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నా రు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభించనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్‌లో జిల్లాస్థ్ధాయి విద్య పరిశీలన కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 25 లోగా ఆయా పాఠశాలలు, కళాశాలలు, వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, వృత్తివిద్యా సంస్థలు తదితర విద్యాలయాల్లో శానిటేషన్‌ ప్లాన్‌, లాజిస్టిక్‌ప్లాన్‌, మెడికల్‌ ప్లాన్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి తరగతిగదిలో విద్యార్థుల మధ్య దూరం కనీసం ఆరు ఫీట్లు ఉండాలని సూచించారు. ప్రతి గదిలో 20 మంది విద్యార్థులకు మించకుండా చూసుకోవాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, డీఈవో రవీందర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ సంధ్యారాణి, మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌ రాజు, డీపీవో శ్రీనివాస్‌, సంక్షేమ శాఖ అధికారులు, ప్రైవేట్‌ పాఠశాలల, కళాశాలల యజమానులు పాల్గొన్నారు.

ప్రొఫార్మాలో వివరాలు సమర్పించాలి

జిల్లాలో భూములకు సంబంధించిన వివరాలను నిర్ణీత ప్రొఫార్మా లో సమర్పించాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో అదన పు కలెక్టర్‌ జీ సంధ్యారాణితో కలిసి భూ సంబంధ వివరాలపై శనివారం తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 11న కలెక్టర్ల్ల కాన్ఫరెన్స్‌ లో జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై సమీక్షించారు. జిల్లాలో రెవెన్యూ కోర్ట్‌ ఏ ర్పాటు, పెండింగ్‌ మ్యుటేషన్స్‌, కంపెనీలు, సంస్థలు, ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించిన వివరాలు, ఆధార్‌ పెండింగ్‌ కేసులు, పట్టాదార్‌ పాస్‌బుక్‌లో తప్పిపోయిన భూముల విస్తీర్ణం, ఎల్‌టీఆర్‌ కేసులు, నిషేధిత ఆస్తుల వివరాలు, సాదాబైనామా వివరాలకు సంబంధించిన పూర్త్తి సమాచారాన్ని నిర్ణీత ప్రొఫార్మాలో గడువులోగా సమర్పించాలని సూచించారు. ఆయా  నివేదికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్రోడీకరించాలని తెలిపారు. ఏదైనా అనుమానిత సమాచారం ఉంటే దాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఆర్డీవో జాడి రాజేశ్వర్‌, తహసీల్దార్లు భోజన్న, వనజారెడ్డి పాల్గొన్నారు.


VIDEOS

logo