Heel Dance | డ్యాన్స్.. మనసుకు ఉల్లాసాన్ని, ఒంటికి ఉత్తేజాన్ని ఇస్తుంది. అందుకే కాలమెంత మారినా నృత్యానికి ఆదరణ తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త నృత్యరీతులు పుట్టుకొస్తున్నాయి కూడా. సంప్రదాయ నృత్యాలే కాకుండా.. సల్సా, జుంబా, హిప్హాప్, జాజ్ లాంటి వాటికి కూడా భారత్‌లో ఆదరణ ఎక్కువగానే ఉంది. తాజాగా తెరపైకి మరో డ్యాన్స్ ఫామ్ వచ్చింది. పేరు.. ‘హీల్ డ్యాన్స్’.
ఎత్తు మడమల చెప్పులు వేసుకుని చేసే డ్యాన్స్ అన్నమాట. పాశ్చాత్యదేశాల్లో ప్రాచుర్యం పొందిన ఈ నృత్యరీతికి ఇప్పుడిప్పుడే భారత్‌లోనూ అభిమానులు తయారయ్యారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరులాంటి చోట్ల శిక్షణ తరగతులూ జరుగుతున్నాయి. హీల్స్‌తో రకరకాల స్టెప్పులు వేయడం ఇక్కడ నేర్పిస్తారు. మ్యూజిక్కు అనుగుణంగా సాగే ఈ డ్యాన్స్ ఫామ్‌లో ఆఫ్రో స్టైల్, వెస్ట్రన్ స్టైల్.. ఇలా భిన్న రకాలు ఉంటాయి. ఎత్తు చెప్పులు వేసుకుని డ్యాన్స్ చేయాలంటే శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం తప్పనిసరి. ఇందుకు ఏకాగ్రత అవసరం. అంతేకాదు, స్టెప్ వేసేప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి. అప్పుడే, కింద పడకుండా డ్యాన్స్ చేయగలరు. శరీరాన్ని, మనసును అనుసంధానం చేసుకుంటూ సంగీతానికి తగ్గట్టు నృత్యం చేయడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. అయితే, పక్కన ట్రైనర్ ఉండాల్సిందే. అబ్బాయిలు కూడా ఈ డ్యాన్స్ ఇరగదీస్తున్నారు.. అదీ హైహీల్స్తోనే.
“Viral Video | ఎవరూ లేరు కదా అని.. డ్యాన్స్ చేసేస్తున్న ఎలుగుబంటి పిల్ల.. వీడియో వైరల్”