మన చుట్టూ ఎవరూ లేనప్పుడు మనలోని అసలు మనిషి బయటకు వస్తాడని ఏదో సినిమాలో హీరో చెప్తాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి సంఘటన గురించే. అడవిలో తనను ఎవరూ గమనించడం లేదని గుర్తించిన ఒక ఎలుగు పిల్ల గంతులేస్తూ కెమెరాకు చిక్కింది. రెండు కాళ్లపై నిలబడి స్టిల్స్ ఇచ్చిన దాన్ని చూస్తే.. ఏదో బ్రేక్ డ్యాన్స్ వేసినట్లే అనిపిస్తుంది మనకు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వాళ్లంతా నవ్వుకుంటున్నారు. ‘‘ఎవరూ చూడటం లేదనుకొని డ్యాన్స్ చెయ్యి’’ అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఇంకొందరేమో.. ‘‘ఫొటోగ్రాఫర్‌కు ఛాలెంజ్ విసిరినట్లుంది’’ అంటూ నవ్వేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటికే ఈ వీడియోను మూడు లక్షలమందికిపైగా లైక్ చేయడం గమనార్హం.
Dance like nobody's watching…🐻🕺😍😅 pic.twitter.com/GoEr16oog2
— 𝕐o̴g̴ (@Yoda4ever) June 2, 2022