హైకోర్టు సీజేని
రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కొత్తగా 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరైన సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం తమ దీర్ఘకాలిక సమస్యలపై చీఫ్ జస్టిస్‌కు వినతిపత్రంగా సమర్పించారు.
- సత్కరించిన ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని విన్నపం
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కొత్తగా 200 అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరైన సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం తమ దీర్ఘకాలిక సమస్యలపై చీఫ్ జస్టిస్‌కు వినతిపత్రంగా సమర్పించారు. ముఖ్యంగా సర్వీస్ నిబంధనలు సవరించాలని, జ్యుడీషియల్ ఆఫీసర్లతో సమానంగా మెడికల్ రీయింబర్స్మెంట్ ఇప్పించాలని, జిల్లా న్యాయవ్యవస్థ బిల్లులను గ్రీన్‌చానల్‌లో చేర్పించాలని, కొత్తగా మంజూరైన కోర్టులకు అవసరమైన సిబ్బందిని మంజూరు చేయాలని, 14 కొత్త ఫ్యామిలీ కోర్టుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సమస్యల పరిషారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని సీజే హామీ ఇచ్చినట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి మాతంగి వీరబాబు, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు వంశీలత, గోపీనాథ్, సంయుక్త కార్యదర్శులు కొమరయ్య, మల్లికార్జున్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

