న్యూఢిల్లీ : వరుస పేపర్ లీకేజీల నేపథ్యంలో ఎన్టీఏ కొత్త ఆఫీసుకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించనుంది. ఇటీవల నీట్-యూజీ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకున్నది. ఇంతకు ముందు ఎన్టీయేలోని గోప్యమైన విభాగంలోకి నిపుణులు వెళ్లి వచ్చే సమయంలో ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో వారు పేపర్లను లీక్ చేశారని సీబీఐ దర్యాప్తులో తేలింది.
దీంతో ఢిల్లీలోని మింట్ రోడ్డులోకి మార్చిన కొత్త ఆఫీసు కోసం 39 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. కార్యాలయంలోని పరీక్ష పత్రాలు, అత్యంత సున్నితమైన సమాచారం ఉండే ప్రాంతాలలోకి ఎవరిని పడితే వారిని అనుమతించకుండా సీఐఎస్ఎఫ్ కఠిన భద్రత కల్పించనుంది.