Unshaadi | అందం అంటే తెల్ల తోలు, నల్ల జుట్టు, నున్నని శరీరం… అనేది సమాజంలో పాతుకుపోయిన అభిప్రాయం. ఆ భావాల మధ్య పెరిగిన యువతీయువకులు తమను ఈ కొలబద్దతో కొలుచుకుని పొంగిపోతూ, కుంగిపోతూ ఉంటారు. సన్నగా ఉందని కరెంటు తీగను బలహీనమైందిగా చూడలేం, ఆకాశాన్ని అంటుతున్నది కదాని వెదురు చెట్టును బలమైందిగానూ భావించలేం. అలాగే మనుషుల్ని వాళ్ల రూపురేఖల్ని బట్టి కాకుండా.. గుణగణాల్ని బట్టి బేరీజు వేయాలని, ముఖ్యంగా పెళ్లి విషయంలో ఈ కోణంలోనే తమ భాగస్వామిని ఎంచుకోవాలని చెబుతున్నది డేటింగ్, మ్యాట్రిమోనియల్ సైట్.. అన్షాదీ.
ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ సంస్థ పెండ్లిళ్లు కుదురుస్తున్నది. ప్రేమకు రూపురేఖలను కొలమానంగా తీసుకోవద్దంటూ అన్షాదీ పెడుతున్న పోస్టులు, వీడియోలు నెటిజన్ల మన్ననలు పొందుతున్నాయి. స్ట్రెచ్ మార్క్స్‌తో ఉన్న తొడభాగం ఫొటోకు- ‘నా శరీరం మీద కాదు.. మచ్చలూ ముడతలూ మీ చూపులో ఉన్నాయి’ అంటూ రాసిన పదునైన రైటప్ అందర్నీ ఆలోచింపజేస్తున్నది. లావుగా ఉన్న అమ్మాయీ, సాధారణంగా ఉన్న అబ్బాయీ.. ఒకరినొకరు కౌగిలించుకున్న ఫొటోకు చాలా లైకులే వచ్చాయి. అబ్బాయి అంట్లు తోముతుంటే, అమ్మాయి వెనక నుంచి అతణ్ని ప్రేమగా హత్తుకున్నట్టు గీసిన చిత్రానికి మంచి స్పందన కనిపిస్తున్నది. ‘అందచందాలు, ఆస్తులు.. ఇవేవీ కాదు. ఫలానా వ్యక్తితో నా ప్రయాణం హాయిగా సాగిపోతుందా, లేదా?’ అనే ప్రశ్నకు మీరిచ్చే సమాధానమే ఇద్దరి భవిష్యత్తునూ నిర్ణయిస్తుంది’ అంటారు అన్షాదీ వ్యవస్థాపకురాలు రుషీ అహూజా. తను ఐఐటీ ఢిల్లీలో చదువుకున్నది.
కొత్తగా పెళ్లయిన జంటను ఆషాఢంలో ఎందుకు ఒక్కచోట ఉండనీయరు?”
“పెండ్లిల్లో వధూవరులను ఏడడుగులు ఎందుకు వేయమంటారు? ఒక్కో అడుగు అర్థమేంటి?”