చెన్నూర్, సెప్టెంబర్ 23 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని శ్రీజగన్నాథస్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన అభినవ పోతన బిరుదాంకితుడు, కవి, రచయిత వానమామలై వరదాచార్యుల విగ్రహం తొలగింపు వివాదానికి దారితీసింది. చెన్నూర్‌లో నిర్వహించిన వరదాచార్యుల శత జయంతి ఉత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులు అప్పట్లో శ్రీ జగన్నాథస్వామి ఆలయం ఎదుట విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ కౌన్సిలర్ మంగళవారం ఆ విగ్రహాన్ని తొలగించారు.
దీన్ని ఓ పార్టీ నాయకుడు వ్యతిరేకించడంతో విగ్రహ తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. విగ్రహాన్ని అక్కడే ఓ పక్కన ఏర్పాటు చేసేందుకు తొలగించామని, ఇందుకోసం వరదాచార్యుల కుటుంబ సభ్యులతోపాటు పట్టణ ప్రముఖుల అనుమతితోనే తాను తొలగించినట్టు బీజేపీ కౌన్సిలర్ పేర్కొన్నారు.