కొత్తగా పెళ్లయిన జంటను ఆషాఢంలో ఎందుకు ఒక్కచోట ఉండనీయరు?
Ashadam | ఆషాఢం వచ్చిందంటే కొత్తగా పెళ్లయిన జంటకు తంటే !! ఎందుకంటే ఆషాఢమాసంలో వారిని కలిసి ఉండనివ్వరు. కొత్తగా పెళ్లయిన అమ్మాయిని అత్తాగారింట్లో ఉండనివ్వకుండా పుట్టింటికి పంపించేస్తారు. మళ్లీ శ్రావణ మాసం వచ్చాకే తిరిగి అత్తారింటికి తీసుకొస్తారు. ఇలా ఆషాఢంలో భార్యాభర్తలను దూరంగా ఉంచడానికి పెద్ద కారణమే ఉంది? ఆషాఢంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం కూడా అదే? ఆ కారణమేంటంటే..
ఆషాఢ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. వాతావరణం చల్లబడటం ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు పెరిగి అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లి కూతురు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిండానికి తొలి మూడు నెలలు చాలా కీలకమైన సమయం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడటం మొదలవుతుంది. ఇలాంటి సమయంలో తల్లి అంటువ్యాధుల బారిన పడితే కడుపులోని బిడ్డపై కూడా ఆ ప్రభావం పడుతుంది. అది కాకుండా ఆషాఢంలో గర్భం వస్తే.. మండు వేసవిలో కాన్పు ఉంటుంది. అంటే ఆ ఎండ తీవ్రతను తల్లీ బిడ్డ ఇద్దరూ తట్టుకోలేరు. దీంతో ఇద్దరికీ అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆషాఢంలో కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. అదీకాకుండా పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య విపరీతమైన ప్రేమ, ఆకర్షణ ఉంటాయి. అలాంటి సమయంలో నెల రోజుల పాటు దూరం ఉంటే.. ఎడబాటు వల్ల కలిగే బాధేంటో వారికి అర్థమవుతుంది. దీంతో వాళ్లు జీవితాంతం అన్యోన్యంగా ఉంటారని అలా చేస్తారు.
ఆషాఢంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు?
ఆషాఢంలో పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకి సేవ వంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి. దీంతో పూజలతో పూజారులంతా బిజీగా ఉంటారు. దీంతో పెళ్లి తంతు నిర్వహించడానికి సమయం ఉండదు. అంతేకాకుండా ఆషాఢ మాసంలో సప్త ధాతువులు సరిగ్గా పనిచేయవు, వర్షాలు కురవడంతో పొలం పనులు కూడా అధికంగా ఉంటాయి.. అలాగే ఆషాఢంలో గర్భధారణకు అనువైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు చేయరు.
Read More :
పెండ్లిల్లో వధూవరులను ఏడడుగులు ఎందుకు వేయమంటారు? ఒక్కో అడుగు అర్థమేంటి?
పెండ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

