పెండ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?
Talambralu | పెండ్లితంతులో తలంబ్రాల వేడుక చూడముచ్చటగా సాగుతుంది. వధూవరులు పోటాపోటీగా ఇందులో పాల్గొంటారు. తలంబ్రాలు అంటే ‘తలపైన పోసే బియ్యం’ అని అర్థం. ఇందులో విరిగిన బియ్యం వాడకూడదు. తలంబ్రాల వేడుకలో పఠించే మంత్రాల్లో విశేషమైన అర్థాలు ఉంటాయి. అవి సంసార బాధ్యతలను గుర్తుచేస్తాయి.
మొదట తలంబ్రాలను కొబ్బరి కుడకలో పోసి, నేతిలో ప్రోక్షించి వధూవరులకు అందిస్తూ ‘కపిల గోవులను స్మరించి, దానం, పుణ్యం చేయాలని, శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి కలగాలని, విఘ్నాలు తొలగి ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమం, మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, నక్షత్రాలు, సోముని వల్ల దాంపత్యం సజావుగా సాగి, సుఖశాంతులు కలగాలని’ పురోహితుడు మంత్ర పఠనం చేస్తాడు.
రెండోసారి వధువు ‘పశవోమేకామస్సమృధ్యతామ్- నాకిష్టమైన పశువులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలి’ అంటూ వరుడి తలపై తలంబ్రాలు పోస్తుంది.
అలాగే వరుడు ‘యజ్ఞోమేకామస్సమృధ్యతామ్- నా కిష్టమైన త్యాగం సమృద్ధిగా ఉండాలి’ అనుకుంటూ తలంబ్రాలు వధువుపై పోస్తాడు. కొందరు చివరగా ఒకేసారి ‘శ్రీయోమే కామస్సమృధ్యతామ్- మాకు కావాల్సిన సిరిసంపదలు సమృద్ధిగా ఉండాలి’ అనే మంత్రం కలిసి చదువుతారు.
Read More :
నిన్నటి దాకా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్.. ఇప్పుడేమో నయా ట్రెండ్.. అసలేంటిది?”
“వివాహ వ్యవస్థ ఎందుకొచ్చింది.. పెండ్లిండ్ల గురించి ఈ కథలు మీకు తెలుసా!”
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే”
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Couple
- culture
- Marriage
- Talambralu
RELATED ARTICLES
తాజా వార్తలు
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

