ఈ ఐదు రకాల వ్యక్తులను అస్సలు పెండ్లి చేసుకోవద్దు..!
Marriage tips: ప్రేమ, మోహం అనేవి రెండూ మంచివే. కానీ ఒక వ్యక్తిని పెండ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు మాత్రం వీటి విషయంలో చాలా ప్రాక్టికల్‌గా ఉండాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల్లోని కొన్ని అవలక్షణాలు

ప్రేమ, మోహం అనేవి రెండూ మంచివే. కానీ ఒక వ్యక్తిని పెండ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు మాత్రం వీటి విషయంలో చాలా ప్రాక్టికల్‌గా ఉండాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తుల్లోని కొన్ని అవలక్షణాలు మనలను ఎంతో బాధిస్తాయి. అలాంటి వ్యక్తులు ఏకంగా జీవిత భాగస్వాములే అయితే జీవితం నరకంలా మారుతుంది. కాబట్టి జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాలి. ముఖ్యంగా ఈ కింద పేర్కొన్న ఐదు రకాల వ్యక్తులను మాత్రం అస్సలు వివాహం చేసుకోవద్దు.
1. రహస్యాలు దాచేవాళ్లు
కొంతమందికి రహస్యాలు దాచిపెట్టడం అలవాటు. రహస్యాలు దాయడం కోసం నిత్యం అబద్దాలు చెబుతుంటారు. అలాంటి వారిని పెండ్లి చేసుకుంటేనే జీవితంలో కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. ఎందుకంటే ఈ లక్షణం ఉన్నవారు జీవితాలను తలకిందులు చేసే రహస్యాలను కూడా చెప్పకుండా దాచేస్తారు. దాంతో తీవ్ర అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది. అలాంటి వారిని పెండ్లి చేసుకునే వారు జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూడాల్సి వస్తుంది. పైగా ఇలా అబద్దాలు చెప్పేవారికి రానురాను అబద్దాలు చెప్పడం ఒక అలవాటుగా మారిపోతుంది.
2. వంచన చేసేవాళ్లు
కొందరు ఉద్దేశపూర్వకంగా మనతో ఒకటి చెబుతూ మరొకటి చేస్తారు. ఇలాంటి వారిని వంచకులు అంటారు. ఇలా వంచించేవాళ్లు ఎప్పుడూ ఎదుటివాళ్లలో మంచితనాన్ని గుర్తించలేరు. వాళ్లు ఏది చేసినా కరెక్టే అని సమర్థించుకుంటారు. కానీ ఎదుటివాళ్లు అదే పనిచేస్తే మాత్రం తప్పుపడుతారు. పెండ్లి అనేది కేవలం ఒక సందర్భం కాదు. ఒక జీవితం. కాబట్టి అలాంటి వ్యక్తిని అస్సలు పెండ్లి చేసుకోవద్దు. చేసుకున్నారంటే జీవితాన్ని చేజేతులా నరకంలా మార్చుకున్నట్టే.
3. ఎప్పుడూ ఏడ్చేవాళ్లు
కొంతమంది ఎప్పుడూ ఏడుస్తుంటారు. ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు. ఇలాంటి వారు గతంలో ఎవరైనా తమను బాధపెట్టిన విషయాన్ని అస్సలు మర్చిపోరు. పదేపదే అదే తలుచుకుని కుమిలిపోతుంటారు. పోనీ వాళ్ల బాధలను వాళ్ల దగ్గర ఉంచుకుంటారా అంటే అదీ లేదు. ఎప్పుడూ ఎదుటివాళ్లకు చెబుతూ విసిగిస్తుంటారు. అంతేగాక ఇలాంటి వాళ్లు ఏ పొరపాటు చేసినా అది తమ పొరపాటుగా ఒప్పుకోరు. గతంలో తమకు అలా జరుగడంవల్లే ఇప్పుడు ఇలా చేయాల్సి వచ్చిందంటూ సమర్థించుకుంటారు.
4. స్వయం వ్యామోహం గలవాళ్లు
కొందరి నోట ఎప్పుడు చూసినా నేను, నాది, నాకు అనే మాటలే వినిపిస్తుంటాయి. ఇలాంటి స్వయంమోహిత వ్యక్తులను కూడా అస్సలు వివాహం చేసుకోవద్దు. ఈ అవలక్షణం మొదట్లో కొంత ఆసక్తికరంగానే అనిపించినా రానురాను విసుగు పుట్టిస్తుంది. ఇలాంటి స్వయం మోహితులు తమను తాము అతిగా ఊహించుకుంటారు. ప్రపంచమంతా తమచుట్టే తిరుగుతుందని భావిస్తారు. తమను తాము ఒక ఆకర్షణ శక్తిగా ఊహించుకుని పొంగిపోతుంటారు. ఈ విశ్వానికే తాము కేంద్ర బిందువులమని ఫీలవుతుంటారు. అలాంటి వ్యక్తిని పెండ్లి చేసుకుంటే నీ గురించి తను ఆలోచించడం సంగతి పక్కన పెడితే.. నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోలేని పరిస్థితి వస్తుంది.
5. ఏదీ స్పష్టంగా చెప్పనివాళ్లు
కొంతమంది మన భావోద్వేగాలతో ఆడుకుంటారు. ఏదీ స్పష్టంగా చెప్పరు. క్లారిటీ కోసం మళ్లీమళ్లీ అడిగినా పట్టించుకోరు. వాళ్లకు మనం ఏం చేస్తున్నామనేది అనవసరం. పైగా వాళ్లచుట్టూ వాళ్లు ఒక కంచెను ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తుంటారు. ఇలాంటి వ్యక్తిని జీవితభాగస్వామిని చేసుకుంటే జీవితం నరకమే. ఎందుకంటే అలాంటి వారితో ఏ ఆలోచనా పంచుకోలేము. ఏ పనీ పర్ఫెక్టుగా చేయడం కుదరదు. అందుకే ఇలాంటి స్పష్టతలేని వ్యక్తులను ముందే దూరం పెట్టడం ఉత్తమం.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

