Tambulam | ఏ సందర్భాల్లో తాంబూలాలు ఇస్తారు.. వాటి ప్రత్యేకత ఏంటి?
Tambulam | తమలపాకులు, వక్కలు, సున్నం, కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి ఇచ్చేదే తాంబూలం. జీర్ణశక్తిని, రోగనిరోధక శక్తిని పెంచేందుకు రకరకాల నిష్పత్తులలో వేర్వేరు తాంబూలాలు కడుతుంటారు. సర్వ సాధారణంగా తాంబూలం అనేది తమలపాకులతోనే ఉంటుంది. అయితే పలు సందర్భాల్లో మామిడి, మారేడు ఆకులతో ఇచ్చే తాంబూలాలు కూడా ఉంటాయి. కవులను గ్రంథరచనకు ప్రోత్సహిస్తూ మహారాజులు కర్పూర తాంబూలాలు, బంగారు తాంబూలాలు ఇచ్చేవారని ప్రబంధాల నుంచి తెలుస్తుంది. ఆరోగ్య రక్షణ కోసం తాంబూలంలో జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తుంటారు.
పెండ్లి, గృహప్రవేశం తదితర శుభకార్యాలలో విందుభోజనం తర్వాత తాంబూలం అందించటం పరిపాటి. వివాహ నిర్ణయ సందర్భాన్ని ‘నిశ్చయ తాంబూలాలు’ అని పిలవడాన్ని బట్టి మన సంప్రదాయంలో తాంబూలానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. షోడశోపచార పూజా విధిలోనూ దైవానికి తాంబూలం సమర్పిస్తారు. ఎవరైనా పెద్దలను, గురువులను కలిసే సమయంలోనూ తాంబూలం ఇస్తుంటారు. అయితే, ప్రమాదాలపాలైన వారిని పలకరించే సందర్భాల్లో తాంబూలం ఇవ్వడం సంప్రదాయ రీత్యా నిషేధం. ఇక రకరకాల ఉత్ప్రేరకాలతో సేవించే తాంబూలం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
Read More :
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు తొమ్మిదో రోజు అత్తవారింటికి ప్రయాణం చేయకూడదంటారు ఎందుకు ?
ఇంటి ముందు గుమ్మడి కాయ ఎందుకు కడతారు?
జపం చేసేటప్పుడు జపమాలను చూపుడు వేలుతో ఎందుకు తిప్పకూడదు?
పారిజాత పుష్పాలు కిందపడినా దేవుడికి పెడతారు ఎందుకు?
కర్మ ఫలం అంటే ఏంటి? ఈ జన్మలో చేసిన పాపాలకు వచ్చే జన్మలో అనుభవించాల్సిందేనా?
ప్రదక్షిణలు చేసేటప్పుడు గర్భగుడి వెనుక తాకడం దోషమా?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- culture
- devotional
- Tambulam
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

