పెండ్లిల్లో వధూవరులను ఏడడుగులు ఎందుకు వేయమంటారు? ఒక్కో అడుగు అర్థమేంటి?
Saptapadi | వివాహ క్రతువు అగ్నిసాక్షిగా జరుగుతుంది. అగ్ని హోత్రం చుట్టూ వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు మంత్ర సమన్వితంగా ఏడడుగులు నడుస్తాడు. దీనినే సప్తపది అంటారు. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. అందుకే వివాహబంధాన్ని ఏడడుగుల బంధం అన్నారు.
మొదటి అడుగు: ‘ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు’ ఆ విష్ణువు మనిద్దరినీ ఒక్కటిగా చేయుగాక!
రెండో అడుగు: ‘ద్వే వూర్జే విష్ణుః త్వా అన్వేతు’ ఇద్దరికీ శక్తి లభించేలా చేయుగాక!
మూడో అడుగు: ‘త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు’ వివాహ వ్రతసిద్ధి కోసం విష్ణువు అనుగ్రహం లభించుగాక!
నాలుగో అడుగు: ‘చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు’ మనకు విష్ణువు ఆనందాన్ని కలిగించుగాక!
అయిదో అడుగు: ‘పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు’ మనకు విష్ణుమూర్తి పశుసంపదను కలిగించుగాక!
ఆరో అడుగు: ‘షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు’ ఆరు రుతువులు మనకు సుఖమిచ్చుగాక!
ఏడో అడుగు: ‘సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు’ గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణకు విష్ణువు అనుగ్రహించుగాక! ఇలా సప్తపదితో దేవాదిదేవుడైన విష్ణుమూర్తి అనుగ్రహం కోరుతారు వధూవరులు.
Read More :
పెండ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?
నిన్నటి దాకా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్.. ఇప్పుడేమో నయా ట్రెండ్.. అసలేంటిది?”
“వివాహ వ్యవస్థ ఎందుకొచ్చింది.. పెండ్లిండ్ల గురించి ఈ కథలు మీకు తెలుసా!”
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే”
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

