Customized Bridal Ware | పెండ్లిళ్లలో ఇదిప్పుడు నయా ట్రెండ్.. ఇంతకీ ఏంటి ఈ ఫ్యాషన్ !!
Customized Bridal Ware | సుముహూర్తానికి ఈ మామిడిపిందెల అంచు చీర కట్టుకో! నెమలి కన్నుల అంచు చూడు ఎంత ముచ్చటగా ఉందో!! కంచిపట్టు అని ఒకరు.. ధర్మవరం అని మరొకరు.. పెండ్లితంతులో వధూవరులు ధరించే దుస్తులకు ఉన్న డిమాండ్ అలాంటిది. కాలం మారింది, పట్టుచీరల స్థానంలో లెహంగాలు దర్జాగా వచ్చి చేరాయి. ‘కస్టమైజ్డ్ బ్రైడల్ వేర్’ పేరుతో ప్రేమ మొగ్గ తొడిగింది మొదలు.. పెండ్లిపీటలు ఎక్కే వరకు జరిగిన మరపురాని మధుర స్మృతులను మనోహర దృశ్యకావ్యంగా డిజైన్ చేస్తున్నారు.
నిధి దోకానియాది బెంగళూరు. ఆమె పెండ్లికి తల్లి ఓ అపురూపమైన బహుమతి అందించింది. అత్తారింటికి వెళ్తున్న కూతురుకు కొండంత దీవెనలు అండగా ఉండాలని బంధుగణం ఆశీస్సులతో పెండ్లి దుస్తులు డిజైన్ చేయించింది. లెహంగాకు జోడీగా వేసుకునే దుపట్టాపై కుటుంబసభ్యుల దీవెనలను ఎంబ్రాయిడరీ చేయించి కొత్తజోడీకి కొంగొత్త అనుభూతిని కలిగించింది. ‘అమ్మ అందించిన ఈ అపురూప కానుకను జీవితాంతం పదిలంగా దాచుకుంటాన’ని నిధి పొంగిపోయింది. పెండ్లి దుస్తులపై నవ దంపతుల పేర్లు, పుట్టింటి ముచ్చట్లు, పెండ్లి తేది, పెండ్లినాటి ప్రమాణాలనూ ఎంబ్రాయిడరీ చేయిస్తూ ఇష్టమైజ్డ్ మధుపర్కాలను ధరిస్తున్నారు ఈ తరం జంటలు.

దుపట్టాపై నాన్న దస్తూరీ..
గురుగ్రామ్‌కు చెందిన సువన్య పెండ్లికి ధరించిన లెహంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. సువన్య తండ్రి కొన్నేండ్ల కిందటే మరణించాడు. కన్నతండ్రి సమక్షంలో పెండ్లి జరిగే అవకాశం లేదు. తండ్రి తనకు రాసిన చివరి లేఖలోని ప్రతి అక్షరాన్నీ సువన్య తన దుపట్టాపై లిఖించింది. ఆయన దస్తూరీ శైలిలోనే ఎంబ్రాయిడరీ చేయించింది. ‘ఆ దుపట్టా ధరించి పెండ్లిపీటలు ఎక్కినప్పుడు, నాన్న దగ్గరుండి నా పెండ్లి చేయించాడన్న అనుభూతి కలిగింది’ అని చెప్పుకొచ్చింది సువన్య.

సెలెబ్రిటీల ట్రెండ్ ఇదే..
బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ తన పెండ్లిలో ధరించిన లెహంగాను రాహుల్ లూథ్రా డిజైన్ చేశారు. బైబిల్లోని కొన్ని వాక్యాలను దానిపై ఎంబ్రాయిడరీ చేయించుకుంది కత్రినా. అలాగే నటి పద్మిని కొల్హాపురీ కోడలు షాజా మొరానీ తన 16 ఏండ్ల ప్రేమకథను పెండ్లి దుస్తులపై డిజైన్ చేయించుకుంది. ఈ విషయం చివరి నిమిషం వరకు కాబోయే భర్తకు తెలియకుండా ప్లాన్ చేసింది మొరానీ.

డిజైనర్లే సొంతంగా..
కస్టమర్లకు నచ్చినట్టు పెండ్లి దుస్తులను రూపుదిద్దే డిజైనర్లు, తమ పెండ్లికి మాత్రం మామూలుగా ఉంటారా? మరింత సృజనాత్మకంగా బ్రైడల్ వేర్‌ను డిజైన్ చేసుకుంటున్నారు. ప్రముఖ డిజైనర్ సబాహ్ షేక్ తన పెండ్లి వేడుకలో కశ్మీరీ ైస్టెల్ బెల్ బాటమ్ ప్యాంట్, కుర్తా, దుపట్టా ధరించింది. దానికి తగ్గ ముత్యాల జువెలరీతో ఎంతో అందంగా ముస్తాబైంది. తన కుర్తాపై వధూవరులిద్దరి పేర్లూ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేయించింది సబాహ్. అలాగే డిజైనర్ క్రేశా బజాజ్ పెండ్లికి ధరించిన లెహెంగాపై తమ ప్రేమకథను అందంగా అల్లింది. కాబోయే జీవిత భాగస్వామితో కలిసి తిరిగిన ప్రదేశాలను లెహెంగాపై ప్రాణప్రతిష్ఠ చేసి ‘ఔరా!’ అనిపించుకుంది.
Read More :
“ఎండాకాలంలో పెండ్లి కూతుళ్లు అందంగా కనిపించాలంటే ఇలా చేస్తే సరి!!”
“Langa Voni Fashion | పెండ్లిళ్ల సీజన్లో సంప్రదాయ లంగా ఓణీలదే హవా !!”
“Baggy Pants | అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన ట్రెండ్ మళ్లీ వచ్చేసింది”
ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్‌లే కాదు.. ఇప్పుడు త్రీడీ డిజైన్లు కూడా వచ్చేశాయ్”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

