Menstrual Disorders | పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడం లేదా? ఈ ఇబ్బంది అధిగమించాలంటే ఏ రోజు ఏం చేయాలంటే..
Menstrual Disorders | రుతుస్రావ సమయంలో హార్మోన్లలో మార్పులు సహజం. ఈ ప్రభావంతో ఒక్కోసారి పీరియడ్స్ క్రమం తప్పుతాయి. ఆ మానసిక ఒత్తిడి వల్ల వెన్నునొప్పి తదితర సమస్యలు రావచ్చు. వ్యాయామంతో ఈ ఇబ్బందులను అధిగమించడం సాధ్యమే.
1 నుంచి 7 రోజులు
రుతుస్రావం మొదలైన మొదటి రోజు నుంచి ఏడో రోజు వరకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కడుపునొప్పి, వెన్నునొప్పి, ఆకలి మందగించడం తదితర సమస్యలు సర్వసాధారణం. అయితే, ఇలాంటి సమయంలో కఠిన వ్యాయామం వల్ల మరింత శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నడక, యోగా ఉత్తమం.
8 నుంచి 13 రోజులు
పీరియడ్స్ తర్వాత మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. లైంగిక ఆసక్తిని పెంచే ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదలయ్యే సమయం ఇది. ఈ రోజుల్లో కొంత బరువైన కసరత్తులు చేయవచ్చు. జిమ్‌లో ఎక్కువ సమయం గడపవచ్చు.

14 నుంచి 16 రోజులు
గర్భధారణకు అనువైన కాలం. గర్భం దాల్చాలను కునేవారు తేలికపాటి వ్యాయామాలు చేయడం మంచిది. మిగతావాళ్లు ఈత, జాగింగ్, సైక్లింగ్.. ఇలా అభిరుచికి తగిన వర్కవుట్ చేసుకోవచ్చు.
17 నుంచి 23 రోజులు
ఈ రోజుల్లో ప్రొజెస్టరాన్ హార్మోన్ భారీగా విడుదల అవుతుంది. దీనివల్ల అలసిపోయినట్టూ కనిపిస్తారు. ఈ సమయంలో ఈత కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది.
24 నుంచి 28 రోజులు
ఇది రుతుస్రావానికి పూర్వ దశ. కడుపు ఉబ్బరంగాను, రొమ్ము వాచినట్టు ఉంటుంది. ప్రాణాయామంతో చిన్నచిన్న చికాకులను తరిమేయవచ్చు.
Read More :
“Feel the Pain | మగాళ్లకి పీరియడ్ నొప్పి వస్తే.. ?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

