అప్పట్లో మొహం చూడటానికే ఇష్టపడేవారు కాదు. ఎదురు పడితే అరిష్టమనేవారు. చేతివంట అపవిత్రమని నమ్మేవారు. గుళ్లూ గోపురాలకు ఆమడదూరం పెట్టేవారు. రుతుస్రావానికి సంబంధించిన అర్థం లేని ప్రచారాలు అనేకం. క్రమంగా ఆ అబద్ధం తొలగుతున్నది. జాతీయ స్థాయిలో జరిగిన ఓ సర్వేలో ఎంతో కొంత పాజిటివ్ ఫలితాలే వచ్చాయి.