‘అణిమాది అష్టసిద్ధులు..’ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఏమిటీ సిద్ధులు? ఏ సాధన అయినా ‘సిద్ధి’ కోసమే! సాధన క్రమంలో ఒక్కోదశ దాటేకొద్దీ సాధకులకు కొన్ని సిద్ధులు ప్రాప్తిస్తుంటాయి. ఈ సిద్ధులను వేర్వేరు రకాలుగా విశ్లేషించినప్పటికీ, ప్రధానంగా ప్రచారంలో ఉన్నవి అష్టసిద్ధులే! అవే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం.
అణిమ: దీనిని సాధించిన వారు తమను తాము సూక్ష్మంగా మార్చుకోగల శక్తి కలిగి ఉంటారు.
మహిమ: భగవంతుడి మహత్తును దర్శించగలిగిన సాధకులకు ఈ సిద్ధి లభిస్తుంది. దీనిని పొందిన సాధకుడు దేవుడికి సమానమైన కీర్తిని సాధిస్తాడు.
గరిమ: శరీర బరువును ఊహించనంతగా పెంచుకోగల శక్తి దీనివల్ల సాధ్యమవుతుంది.
లఘిమ: దీనిని సాధించిన వారు తమ బరువును దూదిపింజంత తేలికగా చేసుకోగలుగుతారు.
ప్రాప్తి: తమకు కావలసిన వస్తువును శూన్యం నుంచి కూడా సృష్టించుకోగలుగుతారు.
ప్రాకామ్యం: దూర దర్శనం, దూర శ్రవణం, ఆకాశ గమనం వంటి దివ్యశక్తులు దీనివల్ల లభిస్తాయి.
ఈశత్వం: దిక్పాలకులను నియంత్రించే శక్తి కలుగుతుంది.
వశిత్వం: సకల జీవరాశులను నియంత్రించగలిగే సిద్ధి ఇది. అణిమాది అష్టసిద్ధులు పొందడం అనుకున్నంత తేలిక కాదు. వీటిని సాధించినవారు ఆ సిద్ధులను ప్రయోగించకూడదన్న నియమమూ ఉంది. కొందరు సిద్ధులు మాత్రం అత్యవసర సమయాల్లో, లోక కల్యాణానికి మాత్రమే వాటిని లీలామాత్రంగా ఉపయోగిస్తారు. పురాణాల ప్రకారం ఆంజనేయుడికి అష్టసిద్ధుల మీద పూర్తి పట్టు ఉందని చెబుతారు. హనుమాన్ చాలీసాలో ‘అష్టసిద్ధి నవనిధికే దాతా’ అని తులసీదాసు హనుమను స్తుతించాడు. వినాయకుడికి కూడా అష్టసిద్ధులు కరతలామలకం అని చెబుతాయి పురాణాలు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
ఎవరైనా మరణిస్తే పది రోజులు ఎందుకు మైల పాటించాలి.. ఇది ఆచారమా? మూఢ నమ్మకమా?
మానవునికి మరణాన్ని మించిన భయమేముంది?