Vandana pamulaparthy | ‘అబద్ధం ఆడినంత ఈజీ కాదు సుమా కవిత్వం అల్లడం’ అన్నారు దాశరథి కృష్ణమాచార్య. ఆలోచన, అన్వేషణ, తీరని ఆవేదనల్లోంచి పుట్టుకొచ్చేదే కవిత్వం. అభ్యుదయ, వచన, భావ కవిత్వాలు రాసేవారు తెలంగాణలో చాలామంది ఉన్నా.. ఆంగ్ల కవయిత్రులు అరుదు. కానీ, వరంగల్‌కు చెందిన వందన పాములపర్తి మాత్రం అంతర్జాతీయంగా పేరు గడిస్తున్నారు.
ఫార్మసీలో పీజీ చేసిన వందనకు ఒక పాప, బాబు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు సన్నిహితుడైన పాములపర్తి సదాశివరావు మనుమరాలు తను. ‘మా తాత తెలుగులో కవిత్వం రాసేవారు. ఆయన్ను చూసి ఆంగ్లంలో రాయడం ప్రారంభించాను’ అంటున్నారు వందన. ఈమె కవితలు ప్రపంచ ప్రఖ్యాతమైన రెండు ఆంగ్ల కవితా సంకలనాల్లో స్థానం సంపాదించుకున్నాయి. వందన కవిత్వంలో భావోద్వేగాలు, సామాజిక సంవేదనలు అపారం. భాష సరళమే అయినా, భావం సూటి.
మార్జిన్ అలెగ్జాండర్.. న్యూయార్క్‌కు చెందిన ప్రఖ్యాత పియానో వాద్యకారుడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయి, సాహిత్యకారులు మెచ్చిన కవితలను ఎంపిక చేసుకొని తనదైన శైలిలో స్వరపరుస్తుంటారు. వందన రాసిన ‘ఫైర్’ కవిత ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా షేర్ అయ్యింది. అది మార్జిన్ అలెగ్జాండర్‌కు నచ్చింది. ‘ఫైర్’తోపాటు మొత్తం పన్నెండు కవితలను ఎంచుకొని స్వరపరిచారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీంతో వందనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ కవితను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వి.వి.రామారావు ‘జ్వలిత జ్వాల’ పేరుతో అనువదించారు. వందన గతంలో ‘డ్రీమ్స్ అండ్ డెస్టినీ ( Dream and destiny )’ శీర్షికన స్వీయ కవితా సంపుటిని తెచ్చారు. ఈ సంకలనం సాహిత్యాభిమానులను ఆకట్టుకున్నది. వందన రాసిన ఏడు ఆంగ్ల కవితలు అంతర్జాతీయ సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. వాటిలో రెండు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాయి. ‘మీ కవితకు నేను స్వరాలను అందిస్తాను. మీ అనుమతి కావాలి.. అంటూ మార్జిన్ అలెగ్జాండర్ నుంచి మెయిల్ రాగానే, ఈ ప్రపంచాన్ని జయించినట్లు అనిపించింది’ అంటారు వందన.
They warn me Not to play with fire But what do they know Of my frozen heart that craves for the Warmth of your love? What do they know Of the burning passion that flows through me with your fiery touch? What do they know Of the essence of fire ?
.. ఇలా సాగిపోయే వందన ‘ఫైర్’ కవితను నిప్పుతోని చెలగాటం కూడదని వాళ్లు నన్ను హెచ్చరిస్తున్నారు! కానీ వాళ్లకేం తెలుసు? ఘనీభవించిన నా హృదయం నీ నులి వెచ్చని ప్రేమ కోసం పరితపిస్తుందని..! అంటూ హృద్యంగా అనువదించారు డాక్టర్ వి.వి.రామారావు.
✍ గడ్డం సతీష్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kattula lakshmi | అప్పుడు తుపాకి పట్టి అక్కగా మారింది.. ఇప్పుడు అనాథలకు అమ్మ అయింది
వైకల్యం వారి ప్రతిభకు అడ్డం కాలేదు.. మోడలింగ్‌లో దూసుకెళ్తున్న కేరళ యువతులు
పిల్లలను ఎప్పుడు స్కూల్‌కు పంపించాలి.. విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ స్వీయ అనుభవం ఏంటంటే..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఐఏఎస్ సాధించడమే కాదు..