Van Cleef Zodiac Pendant | జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రాలను బట్టి రాశులు ఏర్పడతాయి. ఆ రాశికి అధిపతి అయిన గ్రహం అనుకూలత కోసం వివిధ రత్నాలు, రాళ్లను పొదిగిన ఆభరణాలను ధరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయమే. ఆ నమ్మకానికి ఆధునికతనూ, సృజననూ అద్దుతూ రకరకాల డిజైన్లలో ఆభరణాలు రూపొందుతున్నాయి.
వాన్క్లీప్ అండ్ ఆర్పెల్స్ అనే ఫ్రెంచ్ సంస్థ తాజాగా రాశుల బొమ్మలతో రూపొందించిన పెండెంట్లను మార్కెట్లో విడుదల చేసింది. ఆయా జన్మరాశుల వారి కోసం మేషం, వృషభం, సింహం, కర్కాటకం, మీనం.. ఇలా పన్నెండు రాశులకు సంబంధించిన పెండెంట్లు అందుబాటులో ఉంచింది. అంతేకాదు, రాశులనుబట్టి చేతి గడియారాలనూ తయారుచేస్తున్నది వాన్క్లీప్. ఆభర ణానికి నమ్మకమూ తోడైతే.. మార్కెట్‌ను ఊపేయవచ్చని ఆ సంస్థ నమ్మకం.
Jungle jewelry | చాలామంది అమ్మాయిలు ఆశగా చూస్తున్న జంగిల్ జువెలరీ గురించి ఇది తెలుసా”
“మినిమలిజం.. ప్రపంచవ్యాప్తంగా ఇదొక ట్రెండ్.. ఫ్యాషన్‌లో ఇది ఎలా వర్కవుట్ అవుతుందంటే..”
Cleopatra Choker | ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర వాడిన ఈ నగల నమూనా ఇప్పటికే ట్రెండింగ్నే!!”
3D Jewelry | ఆకట్టుకుంటున్న త్రీడీ నగలు.. ఇక పాత డిజైన్లు మరిచిపోవాల్సిందే..”
ఒకప్పుడు పాప్ ప్రియులను ఊపు ఊపిన ఫ్యాషన్ ట్రెండ్ మళ్లీ వచ్చేసింది!!”