శుక్రవారం 05 మార్చి 2021
Zindagi - Jan 13, 2021 , 01:56:41

చలికాలం.. తీపి ఖర్జూరం

చలికాలం.. తీపి ఖర్జూరం

వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు, మనం తీసుకునే ఆహారం కూడా మారాలి. అప్పుడే శరీరానికి సరైన పోషకాలు అందుతాయి. చలికాలంలో ఖర్జూరాలు తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇందులో నేచురల్‌ గ్లూకోజ్‌, ఫైబర్‌, విటమిన్‌ -ఎ, కె, సి, రిబోఫ్లెవిన్‌ వంటి పోషకాలు పుష్కలం.   క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు చల్లటి వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇవి ఎముకలకు సంబంధించిన రుగ్మతల నుంచీ కాపాడతాయి. 

ఎంత తింటే మంచిది?: ఖర్జూరాల్లో పోషకాలు ఎక్కువ కాబట్టి, ఎంత తినాలన్న కొలమానం లేదు. రోజుకు నాలుగైదు అయితే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. మలబద్ధకం, ఐరన్‌ లోపం, జుట్టు రాలే సమస్యలకు ఇవి చెక్‌ పెడతాయి. కాకపోతే, మరీ ఎక్కువగా తింటే బరువు తగ్గుదల సమస్య రావచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. 

చక్కెరకు బదులుగా: ఖర్జూరాలు తియ్యగా ఉండటం వల్ల, చక్కెరకు బదులుగా ఉపయోగించొచ్చు. గింజలు తీసేసిన ఖర్జూరాలను మెత్తగా గ్రైండ్‌ చేసుకుని సలాడ్స్‌, స్వీట్స్‌లోకి వాడొచ్చు. బరువు తగ్గాలనుకునేవాళ్లు పాలలో చక్కెరకు బదులుగా వేసుకోవచ్చు. ఫ్రూట్‌ స్మూతీస్‌లో కూడా ఖర్జూరాల సిరప్‌ను కలుపుకోవచ్చు.   

VIDEOS

logo