sindhu river pushkaralu | సింధునదికి పుష్కరాలు వచ్చేశాయి

sindhu river pushkaralu | భారతావని కర్మభూమిగా ఖ్యాతి గడించడం వెనుక.. ఈ దేశంలో ప్రవహించే పుణ్యనదుల పాత్ర కూడా ఎంతో ఉంది. గంగ, యమున, గోదావరి, కావేరి ఇలా ఎన్నో నదులు మన దేశాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ప్రతి నది పుట్టుక వెనుక ఆసక్తికరమైన పౌరాణిక గాథలు వినిపిస్తాయి. ఈ నదీనదాల్లో వేటి ప్రత్యేకత వాటిది. అలాంటి పుణ్యవాహినుల్లో ఒకటి సింధూ నది. ఈ నదీమతల్లి పుష్కర శోభను సంతరించుకోనుంది. కార్తిక కృష్ణ పాడ్యమి శనివారం (20/11/2021) గురువు కుంభరాశిలోకి ప్రవేశించడంతో సింధు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. నాటి నుంచి 12 రోజులపాటు డిసెంబర్ 1వ తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి. పుష్కర సమయంలో సింధూ నదిలో స్నానం పుణ్యప్రదం. పితృదేవతల ప్రీత్యర్థం తర్పణ, పిండ ప్రదాన, దానధర్మాలు చేయడం పుణ్యప్రదం.
టిబెట్‌లోని మానస సరోవరం ప్రాంతంలో పుట్టిన సింధూ నది మనదేశంలో జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. ఆ తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెడుతుంది. చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నదికి పదుల సంఖ్యలో ఉపనదులు ఉన్నాయి. రావి, బియాస్, సట్లెజ్, చినాబ్, జీలం నదులు సింధు నదికి ఉపనదులే. లద్దాఖ్‌లోని లేహ్, శ్రీనగర్ సమీపంలోని గంధర్‌బాల్ ప్రాంతాల్లో సింధూ నది పుష్కరాల్లో పాల్గొనవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
jagadguru adi shankaracharya | ఆదిశంకరుడికి జీవంపోసిన అరుణ్ యోగిరాజ్
Diwali special | పిలక లేని కొబ్బరికాయను దేవుడికి కొడితే ఏమవుతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
లక్ష్మీదేవి 8 రూపాల వెనుక ఆంతర్యమిది.. దీన్ని అర్థం చేసుకుంటే సిరిసంపదలకు కొదవ ఉండదు
తులసీదాసు భరోసా హనుమాన్ చాలీసా
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

