Sarigamapa auditions| మీకు నలుగురూ మెచ్చేలా పాటలు పాడటం వచ్చా? మీ వయసు 16 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉందా? అయితే మిమ్మల్ని కోట్లాది ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది.. జీ తెలుగు. కొత్త గొంతుకలను గుర్తించే కార్యక్రమంలో భాగంగా.. ‘సరిగమప ది సింగింగ్ సూపర్‌స్టార్’ కోసం ఎంపికలు నిర్వహిస్తున్నట్టు జీ తెలుగు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రియాలిటీ షో ఇప్పటికే 13 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని.. మరో సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. వివిధ నగరాల్లో జరిగిన ఆడిషన్స్‌లో రెండు వేల మందికిపైగా ఔత్సాహికులు పాల్గొన్నారు. హైదరాబాద్‌కు సంబంధించి గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పద్మాలయ స్టూడియోస్, రోడ్ నెంబర్ 78, జెమినీ ల్యాబ్స్ పక్కన, జూబ్లీహిల్స్ చిరునామాలో నిర్వహించే వడపోత కార్యక్రమంలో అర్హులైన వారంతా పాల్గొనవచ్చని జీ తెలుగు పిలుపునిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Vijayashanti | బాలయ్య సినిమాలో విజయశాంతి?
రూ.14 కోట్ల లాభాలు వచ్చినా.. అఖండ అక్కడ ఇంకా సేఫ్ అవ్వలేదుగా..
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
సాయిపల్లవితో అలాంటి సినిమా చేయాలని అనుకున్నా: నాని
RRR | బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్