e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News Laddu box | సంతోషానికే కాదు.. ఫిట్‌నెస్‌కూ ఒక ల‌డ్డూ అంటున్న సిద్దిపేట బిడ్డ‌

Laddu box | సంతోషానికే కాదు.. ఫిట్‌నెస్‌కూ ఒక ల‌డ్డూ అంటున్న సిద్దిపేట బిడ్డ‌

Laddu box | అమెరికా వెళ్లడం ఆమె కల. వెళ్లడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగమూ చేసింది. ఐదేండ్లు గడిచాయి. ఇక చాలనుకొని భార్యాభర్తలు హైదరాబాద్‌ వచ్చేశారు. ఏం చేయాలన్న ప్రశ్న మొదలైంది. ఈసారి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళికతో మిఠాయిల వ్యాపారంలోకి దిగారు. పండుగపూట ‘లడ్డూ బాక్స్‌'తో నోరు తీపి చేసేందుకు వచ్చిన ఉమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌ కవిత గోపుతో జిందగీ ములాఖత్‌.

Laddu box | అమెరికా వెళ్లడం ఆమె కల. వెళ్లడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగమూ చేసింది. ఐదేండ్లు గడిచాయి. ఇక చాలనుకొని భార్యాభర్తలు హైదరాబాద్‌ వచ్చేశారు. ఏం చేయాలన్న ప్రశ్న మొదలైంది. ఈసారి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళికతో మిఠాయిల వ్యాపారంలోకి దిగారు. పండుగపూట ‘లడ్డూ బాక్స్‌’తో నోరు తీపి చేసేందుకు వచ్చిన ఉమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌ కవిత గోపుతో జిందగీ ములాఖత్‌.

ఒకప్పుడు పండుగలు, ఉత్సవాలప్పుడే స్వీట్లు తినేవాళ్లం. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. సంతోషాన్ని పంచుకోవాల్సిన ప్రతీ సందర్భంలోనూ నోరు తీపి చేసుకుంటున్నాం. అయినా, లడ్డూలు తినడానికి ఓ సాకు అవసరమా? స్నాక్స్‌లా ఎప్పుడుపడితే అప్పుడు ఎందుకు ఆరగించకూడదు? అనే కోణంలో ఆలోచించి ఓ స్టార్టప్‌ ప్రారంభించాను. అదే.. లడ్డూ బాక్స్‌.

- Advertisement -

అమ్మ వాళ్లది సిద్దిపేట. తను టీచర్‌. బెల్లం, మిల్లెట్‌ మిశ్రమాన్ని ముద్దలా చేసుకొని బడికి తీసుకెళ్లేది. చాలా ఆరోగ్యకరం అని చెప్పేది. అమ్మకు షుగర్‌ ఉండేది. ఒంట్లో చక్కెర తగ్గినట్లు అనిపిస్తే చాలు, ఆ మిశ్రమాన్ని తినేది. అలా మాకూ మిల్లెట్‌ లడ్డూ అలవాటైంది. పెండ్లయ్యాక కాలిఫోర్నియా వెళ్లాను. రిటైల్‌ కంపెనీలో ఉద్యోగం. చూస్తుండగానే ఐదేండ్లు గడిచిపోయాయి. డబ్బు అయితే సంపాదించాం కానీ, అక్కడే ఉండిపోవాలని అనిపించలేదు. అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చేశాం.

Laddu box | అమెరికా వెళ్లడం ఆమె కల. వెళ్లడమే కాదు పెద్ద కంపెనీలో ఉద్యోగమూ చేసింది. ఐదేండ్లు గడిచాయి. ఇక చాలనుకొని భార్యాభర్తలు హైదరాబాద్‌ వచ్చేశారు. ఏం చేయాలన్న ప్రశ్న మొదలైంది. ఈసారి వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళికతో మిఠాయిల వ్యాపారంలోకి దిగారు. పండుగపూట ‘లడ్డూ బాక్స్‌'తో నోరు తీపి చేసేందుకు వచ్చిన ఉమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌ కవిత గోపుతో జిందగీ ములాఖత్‌.

ఇలా ప్రారంభం..

కాలిఫోర్నియాలో ఉన్నప్పుడే ఫుడ్‌ బిజినెస్‌ ఆలోచన వచ్చింది. చిన్నగా పరిశోధన మొదలుపెట్టాం. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో, అందరికీ ఇష్టమైన మిఠాయిని సెంటర్‌ పాయింట్‌గా తీసుకొని ‘లడ్డూ బాక్స్‌’ లాంచ్‌ చేశాం. అంతలోనే కొవిడ్‌ విజృంభించింది. మా అంచనాలు తలకిందులయ్యాయి. ఆ సమయంలో ‘ఆన్‌లైన్‌’ ఆశాకిరణంలా కనిపించింది. మేమే వెబ్‌సైట్‌ డిజైన్‌ చేసుకున్నాం. మా దగ్గర పదమూడు రకాల లడ్డూలు ఉంటాయి. పదిరకాల కార, ఎనిమిది రకాల చిక్కీలు కూడా లభిస్తాయి. సాధారణంగా లడ్డూల్లో నెయ్యి, బెల్లం
వాడతారు. మేం నెయ్యి లేకుండానే మూడు రకాల లడ్డూలు చేస్తాం.

Laddu box
Laddu box

ఆల్మండ్‌ లడ్డూ, డ్రై ఫ్రూట్‌ లడ్డూ, కొర్ర లడ్డు, రాగి లడ్డు, నువ్వుల లడ్డు, పల్లీ లడ్డు తదితర రకాలు మా దగ్గర అందుబాటులో ఉంటాయి. మహిళల కోసం ‘షీ పవర్‌ లడ్డూ’, పిల్లల కోసం ‘కిడో జాయ్‌’, పెద్దలకు ‘ఫిట్‌నెస్‌ లడ్డూ’.. ఇలా కుటుంబం మొత్తానికి లడ్డూ ప్యాక్‌ అందిస్తున్నాం. పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లో మా స్టోర్‌ ఉంది. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. పదిహేను మంది మహిళలకు ఉపాధినిస్తున్నాం. మొదట్లో ముడిసరుకు ఎక్కడినుంచి తేవాలో తెలిసేది కాదు. అలాంటి సమయంలో వీ-హబ్‌ తోడుగా నిలిచింది. లడ్డూ బాక్స్‌ను ప్రారంభించినసమయానికి నేను ఆర్నెల్ల గర్భిణిని. కడుపులో ఉన్న బిడ్డను ఎలా కాపాడు
కున్నానో, లడ్డూ బాక్స్‌నూ అలానే చూసుకుంటున్నాను. అవును, లడ్డూ బాక్స్‌ నాకు బిడ్డ లాంటిది.

Laddu box
Laddu box

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆస్ట్రేలియా స్థానిక‌ ఎన్నిక‌ల్లో గెలిచిన తెలంగాణ ఆడ‌బిడ్డ‌.. ఆమె విజ‌య ర‌హ‌స్య‌మిదే..

gauthami jeji | బొల్లి మ‌చ్చ‌లు ఉన్నాయ‌ని కుంగిపోలేదు.. మోడ‌లింగ్‌లో అద‌ర‌గొడుతుంది..

Keerthi priya | రైత‌న్న‌ల‌కు అండ‌గా సూర్యాపేట యువ‌తి.. ఇంత‌కీ ఆమె ఏం చేస్తోందంటే..

nalli fashions | తాత‌ల నుంచి చేస్తున్న చీర‌ల వ్యాపారానికి ఈమె బ్రాండ్ క్రియేట్ చేసింది

Vijayalakshmi | చ‌దివింది ప‌దో త‌ర‌గ‌తే కానీ.. చేసేది కోట్ల బిజినెస్‌

Gray hair | చిన్న‌వ‌య‌సులోనే త‌ల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్‌స్పిరేష‌న్‌.. ఎందుకంటే?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement