human rights day ( నేడు మానవ హక్కుల దినోత్సవం )| స్త్రీ అక్షరాస్యత పెరుగుతున్నది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎంత ఉన్నతస్థాయికి వెళ్లినా.. పనిచేసే చోట మాత్రం ప్రశాంతత లేకుండా పోతున్నది. లైంగిక వేధింపులకు గురికావాల్సి వస్తున్నది. పేరుకు చట్టాలున్నా, ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ తాజా అధ్యయనం రుజువు చేస్తున్నది. ఆ నివేదిక సారాంశం..
రాజ్యాంగ అధికరణం 19 (1) జీవనోపాధి స్వేచ్ఛను ప్రసాదించింది. కానీ సకల అర్హతలతో, దీటైన నైపుణ్యంతో వృత్తి ఉద్యోగాల్లో అడుగుపెడుతున్న మహిళలకు అడుగడుగునా అవరోధాలే. ఈ లైంగిక వేధింపులను అరికట్టేందుకు భారత ప్రభుత్వం 2013లోనే చట్టం చేసింది. 10 మందికన్నా ఎక్కువ మహిళలు ఉన్న కార్యాలయాలు కచ్చితంగా లైంగిక వేధింపులను నిరోధించేందుకు ఓ అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఫిర్యాదు అందిన వెంటనే ఆ అంతర్గత కమిటీ విచారణను ప్రారంభించి, 90 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ఆ సూచనలను ఆయా సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాల్సిందే. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే సదరు ఉద్యోగిపై 509తో పాటు, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. నేరం రుజువైతే జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు.
✍ మ్యాకం రవికుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Woman pilots | ప్రపంచంలోనే మహిళా పైలట్లు మన దగ్గరే అధికం
కూతురుపై లైంగిక దాడికి పాల్పడిన ప్రియుడికి మహిళ సాయం
కన్నతండ్రే వివక్ష చూపిస్తున్నాడు.. ఏం చేయాలి?
ఆన్లైన్లో పోకిరీలు వేధిస్తున్నారా? పోలీసులు చెబుతున్న ఈ సూచనలు ఫాలో అవ్వండి..