కన్నతండ్రే వివక్ష చూపిస్తున్నాడు.. ఏం చేయాలి?

నా మిత్రురాలు యూకేలోని టాప్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసింది. ఆమె తండ్రి పెద్ద వ్యాపారవేత్త. నా స్నేహితురాలి భర్త మాత్రం పెద్దగా చదువుకోలేదు. కానీ, వీళ్ల కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంత చదువుకున్నా తండ్రి తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని నా ఫ్రెండ్ బాధపడుతూ ఉంటుంది. వ్యాపార విషయాల్లో ఎంత మంచి సలహా ఇచ్చినా పట్టించుకోరట. ఆమె భర్త మాటకు మాత్రం ఎంతో విలువ ఇస్తారట. తన తండ్రి లింగ వివక్ష చూపుతున్నాడని తన ఆరోపణ. ఈ సమస్యకు పరిష్కారం ఉందా?
– ఓ స్నేహితురాలు
జ : మీ ఫ్రెండ్ మానసికంగా కుంగిపోవడం బాధాకరమైన విషయమే. తనను మామూలు స్థితికి తీసుకురావడంలో మీ పాత్ర చాలా ఉంటుంది. అయితే వాళ్ల నాన్న ఒక్క వ్యాపారం విషయంలోనే తననూ, తన సలహాలనూ నిర్లక్ష్యం చేస్తున్నారా? లేకపోతే చిన్నప్పటి నుంచీ లింగ వివక్ష ఉందా? అన్నది గమనించాల్సిన విషయం. ఈ విషయాల్లో మీ స్నేహితురాలికి స్పష్టత ఇవ్వాలి. ఒకవేళ ఈ ఒక్క విషయంలో మాత్రమే అయితే.. బాల్యం నుంచీ తండ్రి చూపిన ప్రేమ, ఆప్యాయతలను ఆమెకు గుర్తు చేయాలి. తన కోసం తండ్రి పడిన కష్టాన్ని తెలియపర్చాలి. తద్వారా తండ్రిపై ఆమె అభిప్రాయం మారే అవకాశం ఉంది. అలాగే, వ్యాపార పనులకు కొన్నిరోజులు దూరంగా ఉండమని చెప్పండి. ఆమెను విహారయాత్రకు తీసుకెళ్లమని భర్తకు సలహా ఇవ్వండి. దీనివల్ల ఆలూమగల మధ్య మానసిక సామీప్యం పెరుగుతుంది. అయినా, ఆమెలో మార్పు రాకపోతే కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లడం మంచిది.
సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV
హైదరాబాద్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mixed Fruits :ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
Fertility problems | సంతానలేమికి కారణం?
Diabetes and Sugar : చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి
Milk | మీరు తాగే పాలు కల్తీ అయ్యాయని అనుమానమా ! ఈ చిట్కాతో తెలుసుకోండి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

