ఆన్లైన్లో పోకిరీలు వేధిస్తున్నారా? పోలీసులు చెబుతున్న ఈ సూచనలు ఫాలో అవ్వండి..

హైదరాబాద్ : ఇటీవల కాలంలో మహిళలపై ఆన్లైన్ వేధింపులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పోలీసులు పలు సూచనలు చేశారు. పోకిరీల విషయంలో మౌనంగా ఉండవద్దని.. అలా ఉండటం వల్ల వాళ్లు మరింత రెచ్చిపోతారని హెచ్చరించారు. ఎవరైనా వేధిస్తుంటే ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని.. వాళ్ల బెదిరింపులకు భయపడొద్దని సూచించారు. అంతేకాకుండా ఆన్లైన్లో ఎవరైనా వేధింపులకు పాల్పడినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదనే దానిపై పలు సూచనలు చేశారు.
ఇలా చేయండి..
☞ మిమ్మల్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తుంటే వెంటనే మీ ఇంట్లో పెద్దలకు, మీకు సన్నిహితంగా ఉండేవారితో విషయాన్ని పంచుకోండి. ఎలాంటి ఆందోళనలు వద్దు.
☞ మీకు పంపే మెసేజ్‌లు, ఇతర అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలను స్క్రీన్‌షాట్ తీసుకుని సేవ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇవి తర్వాత ఆధారాలుగా పనికివస్తాయి.
☞ మీకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపే వారిని వెంటనే అన్‌ఫ్రెండ్ లేదా బ్లాక్ చేయాలి.
☞ మీ స్నేహితులకు సంబంధించి కూడా ఇలాంటి విషయాలు తెలిస్తే వెంటనే వారి పెద్దల దృష్టికి తీసుకెళ్లండి. మౌనంగా ఉండవద్దు.
ఇలా చేయకండి..
☞ అడ్డగోలు మెసేజ్‌లు, అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పెట్టేవారికి ఎట్టిపరిస్థితుల్లోనూ రిప్లై ఇవ్వవద్దు. వాటిని పట్టించుకోకపోవడం మంచిది.
☞ అవతలి వ్యక్తులకు సమాధానం ఇస్తూ వెళ్తే వాళ్లు మరింత రెచ్చిపోతారు.
☞ మిమ్మల్ని బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టినా, ఫోన్‌కాల్స్ చేసి బెదిరించినా సమాధానం ఇవ్వవద్దు.
☞ ఇతరులు వేధించడాన్ని మీ తప్పుగా తీసుకుని మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- online harassment
- Police
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

