Omkar | ఎవరైనా తనను ఇమిటేట్ చేస్తే ఏమనిపిస్తుందో చెప్పిన ఓంకార్
Omkar | ఫిజియోథెరపిస్ట్ నుంచి బెస్ట్ యాంకర్ వరకూ ఓంకార్ కెరీర్ ప్రయాణం.. స్పోర్ట్స్ కార్ అంత స్పీడుగా ఏం సాగలేదు. అనేక అవరోధాలున్నాయి. ట్రెండ్‌ను ఫాలో కావడం కంటే, సెట్ చేయడమే తనకు ఇష్టమని అంటున్న ఓంకార్‌తో ‘జిందగీ’ ముచ్చట్లు..

యాంకర్‌గా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నేను యాంకర్ కావాలని ఇండస్ట్రీకి రాలేదు. డైరెక్టర్, యాక్టర్ అవుదామనుకున్నా. కానీ, యాంకర్ అయ్యాను. అనుకోకుండానే అయినా అనుకున్నదానికన్నా ఎక్కువ పేరు, గుర్తింపు వచ్చింది.
మీ సొంతూరు?
మాది కాకినాడ. నాన్న డాక్టర్. జగన్నాథపురంలో హాస్పిటల్ ఉండేది. చుట్టుపక్కల ఊళ్లవాళ్లకు తక్కువ ఫీజుతో వైద్యం చేసేవారు నాన్న. తనేమీ సంపాదించుకోలేదు. కానీ మంచి
డాక్టర్‌గా, మంచి మనిషిగా మాత్రం మిగిలిపోయారు.
ఇండస్ట్రీకి ఎందుకొచ్చారు?
కాలేజీ రోజుల్లోనే నలుగురిలో మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా ఏదైనా చేయాలనిపించింది. తక్కువ సమయంలో ఎక్కువ పేరు వచ్చే రంగాలు మూడు.. క్రికెట్, రాజకీయం, సినిమా. నాకు రాజకీయాలు అస్సలు తెలియదు. అందుకే వద్దనుకున్నా. క్రికెట్ అంటే చాలా ఇష్టం. బాగా ఆడతాను కూడా. కానీ, నాన్న చదువు దెబ్బతింటుందని చెప్పడంతో వదిలేశా. ఆయన కోరిక ప్రకారం ఫిజియోథెరపీలో పట్టా తీసుకుని సినీ పరిశ్రమకు వచ్చా.
సొంతంగా రూపొందించిన మొదటి షో?
ఆదిత్య మ్యూజిక్‌లో ఉన్నప్పుడే ‘జీ తెలుగు’లో అవకాశం వచ్చింది. యాంకర్‌గా ‘మాయాబజార్’ చేస్తున్నప్పుడు.. సొంతంగా షో చేసే అవకాశం వచ్చింది. ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దామనుకున్నాను. అన్ని చానళ్ల కార్యక్రమాలనూ పరిశీలించాను. విఠలాచార్య సినిమాలంటే చిన్నప్పటినుంచీ ఇష్టం. ఫాంటసీ అందరికీ నచ్చుతుంది. రొటీన్‌కు భిన్నంగా పిల్లలతో ఒక సోషియో ఫాంటసీ షో చేయాలనిపించింది. ఆ ఆలోచనతోనే ‘మాయాద్వీపం’ మొదలైంది. క్రియేటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాంకర్‌గా నేను చేసిన తొలి కార్యక్రమం అది. ఇక, వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ఆట’ నన్ను టాప్ ప్లేస్‌కి తీసుకెళ్లిన షో.

చాలారోజుల తర్వాత మళ్లీ పిల్లలతో షో చేస్తున్నట్టున్నారు?
దాదాపు ఎనిమిదేండ్లయింది. ఇప్పుడు మళ్లీ ‘మాయాద్వీపం’తో మీ ముందుకొచ్చా. పిల్లల్నే కాకుండా పెద్దల్నీ అలరించేలా కొన్ని మార్పులు చేశాం. మరింత ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. వారి ముద్దుముద్దు మాటలు, కల్మషంలేని నవ్వులు ఎంతటి బాధనైనా మరిపిస్తాయి. అందుకే పిల్లలతో షో చేసేందుకు ఇష్టపడతాను.
కొంతమంది మిమ్మల్ని ఇమిటేట్ చేస్తుంటారు కదా! ఎలా ఫీలవుతారు?
చాలా సంతోషపడతా. అదృష్టంగా భావిస్తా. సాధారణంగా హీరోలను, రాజకీయ నాయకులను మాత్రమే ఇమిటేట్ చేస్తారు. అయినా, కొంతమందికి అదో ఉపాధి. మనమెందుకు చెడగొట్టాలి. అందుకే సరదాగా తీసుకుంటా.
కుటుంబం గురించి..
నాన్న రెండేండ్ల క్రితమే చనిపోయారు. అమ్మ, తమ్ముడు, చెల్లి.. అందరూ హ్యాపీగా ఉన్నారు. నాన్న నా సక్సెస్ చూడగలిగారనే సంతోషం ఉంది. ఆయన మంచితనం ఫలితమే, నా విజయమని భావిస్తాను.
తొలి అవకాశం ఎలా వచ్చింది?
హైదరాబాద్‌కు వచ్చాక ఓ హాస్పిటల్లో పనిచేస్తూ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలని ప్రయత్నించేవాడిని. కొన్నాళ్లు తిరిగాక నాకే వద్దనిపించింది. ఓ రోజు పేపర్లో ‘ఇన్కేబుల్’ అనే లోకల్ చానల్ కోసం యాంకర్లు కావాలనే ప్రకటన కనిపించింది. ఇంటర్వ్యూకి వెళ్లాను. నన్ను ఎంపిక చేశారు. ‘ఇన్కేబుల్’లో పేరు, గుర్తింపు రాక పోయినా అనుభవం సంపాదించాను. ఏడాదిన్నర తర్వాత, ఆదిత్య మ్యూజిక్ (జెమినీ మ్యూజిక్) ‘అంకితం’లో అవకాశం వచ్చింది. కొద్దిరోజుల్లోనే బాగా పాపులర్ అయ్యాను. దాంతో నా కెరీరే మారిపోయింది.
✍ ప్రవళిక వేముల
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Kangana Ranaut : కాంట్రవర్సీ క్వీన్ కంగనా.. సినిమాల కంటే వివాదాలే బోలెడు.. లిస్ట్ పెద్దదే
పవన్ కళ్యాణ్‌తో నితిన్ పోటీ.. తెలిసి చేశాడా.. తెలియక చేశాడా..?
Pawan Kalyan Condition | అనిల్ రావిపూడికి షరతు పెట్టిన పవన్‌కల్యాణ్..?
ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికార్రా.. నెటిజన్ కు RRR టీమ్ రిప్లై..
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు మహాసభలను జయప్రదం చేయాలి’
BRS | బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ యువకులు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

