ఓరి మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికార్రా.. నెటిజన్ కు RRR టీమ్ రిప్లై..

RRR movie | ఈ రోజుల్లో ఒక పెద్ద సినిమా తెరకెక్కుతుంది అంటే దాని మీద కాంట్రవర్సీలు కూడా అలాగే వస్తాయి. కథ ఎలా ఉన్నా కూడా వివాదం కామన్ అయిపోయింది. ఎక్కడో ఒకచోట ఆ సినిమాపై కచ్చితంగా కాంట్రవర్సీ రేగడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమాపై కూడా ఇలాంటి వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటిస్తుండటంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా ఇందులో మన్నెం వీరుడు అల్లూరిగా రామ్ చరణ్.. గిరిజన వీరుడు కొమ్రం భీమ్‌గా తారక్ నటిస్తున్నారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసినట్టు చరిత్రలో లేదు. కానీ సినిమాలో ఇద్దరూ కలిసినట్లు చూపిస్తున్నాడు రాజమౌళి. ఇక్కడే అసలు కాంట్రవర్సీకి తెరలేసింది.

చరిత్రను పక్కదోవ పట్టిస్తే కచ్చితంగా చూస్తూ ఊరుకోము.. దానికి సమాధానం మీరు చెప్పాల్సిందే అంటూ రాజమౌళి ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. అయితే ఈ సినిమా కథ పూర్తిగా ఊహాజనితమైంది.. చరిత్రలో వాళ్లిద్దరూ కలిసినట్లు ఎక్కడా లేదు.. కానీ కలిస్తే ఎలా ఉంటుందో అనే ఊహతో ఈ సినిమా చేశామని ఇదివరకే ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పాడు రాజమౌళి. అల్లూరి, కొమ్రం భీమ్ పుట్టిన సంవత్సరాలు కానీ వీళ్లు పెరిగిన ప్రాంతాలు కానీ పూర్తిగా వేరు. చరిత్రలో ఇద్దరూ మహా వీరుల కథ తీస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఇదివరకే చెప్పాడు రాజమౌళి. ఇది పూర్తిగా ఒక ఫిక్షనల్ స్టోరీ.. స్నేహం ఆధారంగా సాగుతుంది అని చెప్పుకొచ్చాడు. అయితే ఓ నెటిజెన్ మాత్రం ఈ చిత్ర కథపై కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తూ కామెంట్ పెట్టాడు.

‘1920లో స్వాతంత్ర సమరయోధులు ఇంటి నుంచి వెళ్లిపోయి దాదాపు రెండేండ్ల తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారని.. కాబట్టి ఆ గ్యాప్‌లో ఏం జరిగిందో మనకు తెలీదు కాబట్టి ఆ పార్ట్‌ను ఫిక్షన్‌గా తెరకెక్కించాలని రాజమౌళి అనుకోవడంలో తప్పులేదు కానీ.. మనకు తెలిసిన స్టోరీని కూడా మార్చి చూపించడం ఏంటి అన్నది పెద్ద డౌట్..’ అని ఒక కామెంట్ పెట్టాడు నెటిజన్. దీనికి ట్రిపుల్ ఆర్ యూనిట్ నుంచి ఊహించని రియాక్షన్ వచ్చింది. ‘ఓరీ మీ దుంపలు తెగ.. మీరెక్కడ దొరికారు రా.. డైరెక్టర్ రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాడు కదా.. క్లియర్‌గా.. మీకు తెలిసిన స్టోరీ సినిమాలో ఉండదు.. మైండ్‌లో నుంచి అవన్ని తీసేసి సినిమాను ఎంజాయ్ చేయండి’ అని అంటూ ఫన్నీగా జవాబిచ్చారు. ఏదేమైనా ఇద్దరు చరిత్రకారుల క్యారెక్టర్స్‌తో కథ తీస్తున్నప్పుడు కచ్చితంగా కాంట్రవర్సీలు వస్తాయని రాజమౌళికి తెలియని విషయం కాదు. అయినా కూడా ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నాడు. జనవరి 7, 2022న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బాబోయ్ ఇది ఊర నాటు.. మాస్ డాన్సులతో కుమ్మేసిన చరణ్, ఎన్టీఆర్..
Alia bhatt | అమ్మో రెండేండ్లలో ఆలియాభట్ అంత సంపాదించిందా?
Rajamouli | పవన్ కళ్యాణ్‌తో సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rajamouli: థియేటర్స్ కోసమే సినిమాలు చేస్తానని చెప్పిన రాజమౌళి
Ntr: జూనియర్ ఎన్టీఆర్ క్రికెట్ చూడకపోవడానికి ఆయన తండ్రే కారణమట..!
keeravani remuneration | ట్రిపుల్ ఆర్ కోసం కీరవాణి అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
రాజమౌళి సినిమాకు పని చేసినా పేరు రాదు.. రామ్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- NTR
- Rajamouli
- ram charan
- RRR
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

