e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home News రాజమౌళి సినిమాకు పని చేసినా పేరు రాదు.. రామ్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

రాజమౌళి సినిమాకు పని చేసినా పేరు రాదు.. రామ్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. బాలీవుడ్ లోనూ ఇప్పుడు ఎంతోమంది రాజమౌళి సినిమాలో పని చేయాలని కోరుకుంటున్నారు. ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలు ఎంతో పేరు వస్తుందని అంతా సంబరపడిపోతుంటారు. అందుకే ఆయన సినిమాలో చిన్న పాత్ర చేయడానికి కూడా సిద్ధ‌ప‌డుతున్నారు. బాహుబలి సినిమాలో కేవలం 10 నిమిషాలు కూడా లేని అస్లాం ఖాన్ పాత్ర సుదీప్ లాంటి స్టార్ హీరో చేశాడంటే అదీ రాజమౌళికి ఉన్న ప్రాముఖ్యత. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాలోనూ అలియా భట్ కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉండే పాత్రలో కనిపిస్తుంది. దానికి కారణం కూడా రాజమౌళినే. ఈయన సినిమాలో ఒక్క సీన్ చేసినా చాలు అనుకునే వాళ్లు చాలా మంది ఉంటారు. అలాగే టెక్నీషియన్స్ కూడా. దర్శక ధీరుడి సినిమాకు పని చేయాలని చాలా మంది వేచి చూస్తుంటారు. అలాంటిది రాజ‌మౌళి సినిమాల‌కు ప‌నిచేయ‌డం గురించి ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్‌ ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌మౌళి సినిమాకు ప‌నిచేసినా పేరు రాద‌ని చెప్పుకొచ్చారు.

జక్కన్న సినిమాకు పని చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని రామ్ ల‌క్ష్మ‌ణ్ చెప్పారు . అయితే ఆయన సినిమాలకు పని చేయాలంటే ఒకేసారి 40 నుంచి 60 రోజుల వరకు డేట్స్ ఇచ్చేయాల్సి ఉంటుందన్నారు. టైమ్ లేదు అనే మాట చెప్పడం రాజమౌళికి అస్సలు నచ్చదని.. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. మగధీరతో పాటు రాజమౌళి తెరకెక్కించిన చాలా సినిమాలకు రామ్ లక్ష్మణ్ పని చేశారు. కానీ బాహుబలి, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలకు మాత్రం చేయడం లేదు. దానికి కారణం డేట్స్ ఎక్కువగా ఇవ్వలేకపోవడమే అంటున్నారు ఈ ఫైట్ మాస్టర్స్. ఆర్ఆర్ఆర్‌లోనూ ఇంటర్వెల్ ఫైట్ 10 రోజులు చిత్రీకరించామని.. అయితే చరణ్‌కు దెబ్బ త‌గిలి ఆ షూటింగ్‌ 40 రోజులు అయిపోయిందని.. దాంతో తప్పుకోక తప్పలేదంటున్నారు ఈ బ్రదర్స్.

- Advertisement -

ఇక్కడే ఇంకో మాట కూడా చెప్పారు. రాజమౌళి సినిమాకు పని చేసినా కూడా ఫైట్ మాస్టర్స్ కు పెద్దగా పేరు రాదని అన్నారు. అన్నీ రాజ‌మౌళి దగ్గరుండి చూసుకుంటాడని.. 70 శాతం స్టంట్స్ కూడా రాజమౌళి స్వయంగా చెప్పేస్తాడని.. దాంతో అక్కడ తామే సొంతంగా చేసిన ఫీలింగ్ కూడా ఉండదని చెప్పారు రామ్ లక్ష్మణ్. తమకే కాదు.. రాజమౌళి సినిమాలకు ఎవరు పని చేసినా కూడా స్టంట్స్ విషయంలో మాస్టర్స్ కు పేరు రాదు.. క్రెడిట్ అంతా రాజమౌళికే వెళ్తుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వీళ్లు. అందులో నిజం కూడా లేకపోలేదంటున్నారు అభిమానులు. తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఆ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళికి చేతులెత్తి దండం పెడుతున్నట్లు తెలిపారు రామ్ లక్ష్మణ్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

మా ఎన్నిక‌లు..ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్న‌కు న‌రేశ్ సెటైరిక‌ల్ రిప్లై

నో ఓటీటీ..సిల్వ‌ర్ స్క్రీన్ పైనే ‘నార‌ప్ప’ సంద‌డి..!

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వ‌స్తున్న తెలుగు సినిమాలివే..!

బంగార్రాజు చిత్రంలో ‘బేబ‌మ్మ‌’..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana