టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగార్జున హీరోగా బంగార్రాజు సినిమా రానున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్న నాయన చిత్రానికి కొనసాగింపుగా రాబోయే ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. త్వరలోనే బంగార్రాజును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు నాగార్జున రెడీ అవుతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. ఈ మూవీలో రమ్యకృష్ణ మరోసారి నాగ్ కు జోడీగా మెరువనుంది. నాగచైతన్య కీ రోల్ పోషిస్తున్నాడు. బంగార్రాజులో నాగచైతన్యకు జోడీగా ఉప్పెన ఫేం కృతిశెట్టి కనిపించబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
బేబమ్మ (కృతిశెట్టి) బంగార్రాజు తారాగణంలో చేరిపోతుందా అనే దానిపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది. తాజా సమాచారం ప్రకారం జులై లేదా ఆగస్టులో బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లనుంది. కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రంలో జయప్రద కూడా కీలక పాత్రలో కనిపించనుందట. బంగార్రాజు ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్