e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వ‌స్తున్న తెలుగు సినిమాలివే..!

ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో వ‌స్తున్న తెలుగు సినిమాలివే..!

కొంత‌కాలంగా థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో మూవీ ల‌వ‌ర్స్ బోరుగా ఫీల‌వుతున్నారు. అయితే వారికి ఎంట‌ర్ టైన్ మెంట్ అందించేందుకు ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఎప్ప‌టిలాగే ఈ వారం డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాల‌తో వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతోంది. ఈ వీకెండ్ కూడా థ్రిల్ల‌ర్స్, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తుంది. ఈ వీకెండ్ నెట్‌ఫ్లిక్స్ లో సంద‌డి చేయ‌బోతున్న సినిమాల‌పై ఓ లుక్కేయండి మ‌రి..

పిట్ట‌క‌థ‌లు:
నెట్ ఫ్లిక్స్ అంథాల‌జీగా వ‌స్తున్న ప్రాజెక్టు పిట్ట క‌థ‌లు. త‌రుణ్ భాస్క‌ర్, బీవీ నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి డైరెక్ష‌న్ లో న‌లుగురు మ‌హిళ‌లు భ‌యంక‌ర‌మైన ప‌రిస్థితుల్లో తీసుకున్న నిర్ణ‌యాల‌కు ఎలాంటి సంఘ‌ట‌నలు ఎదుర్కొన్నారు. ప్రేమ‌లోని ప‌లు కోణాల‌ను ఆవిష్క‌రిస్తూ సాగే ఈ ప్రాజెక్టును నాలుగు ఎపిసోడ్లుగా తీర్చిదిద్దారు.

- Advertisement -

కేరాఫ్ కంచ‌ర‌పాలెం:

కేరాఫ్ కంచ‌ర‌పాలెం. ఇండియాలోని ఓ చిన్న ప‌ట్ట‌ణంలోని నాలుగు రకాల అంద‌మైన క‌థ‌ల‌తో సాగే చిత్రం. స్కూల్ బాయ్ క్ర‌ష్ నుంచి మ‌ధ్య వ‌య‌స్కుడైన బ్యాచ్‌ల‌ర్ ఆఫీస్ రొమాన్స్, యువ‌తీయువ‌కులైన కార్తీక్ ర‌త్నం, ప్ర‌వీణ ప‌రుచూరి మ‌ధ్య ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయని చూపిస్తూ.. అన్ని ర‌కాల జ‌న‌రేష‌న్ ను క‌వ‌ర్ చేస్తూ కొన‌సాగ‌నుందీ చిత్రం.

మిస్ ఇండియా :

మాన‌స సంయుక్త అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన యువ‌తి స‌క్సెస్ స్టోరీ ఇది. మాన‌స సంయుక్త ఎన్నో క‌ష్టాల న‌ష్టాల‌కు ఓర్చి స్వ‌శ‌క్తితో యునైటెడ్ స్టేట్స్ లో వ్యాపార‌వేత్త స్థాయికి ఎలా ఎదిగిందో చూడొచ్చు. విభిన్న బావోద్వేగాల‌తో సాగే మిస్ ఇండియా ఫీల్ గుడ్ చిత్రం. స్నేహితులు, కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి ప‌ర్ ఫెక్ట్ మూవీ టైంను ఎంజాయ్ చేయొచ్చు.

ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌:
2016 మ‌ల‌యాళ రీమేక్ గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఉమా మ‌హేశ్వ‌ర రావుగా టైటిల్ రోల్ లో స‌త్య‌దేవ్ న‌టించాడు. సున్నిత స్వ‌భావం గ‌ల ఫొటోగ్రాఫ‌ర్ ఉమా మ‌హేశ్వ‌ర్ రావు. అయితే అతడికి అనుకోకుండా రౌడీతో గొడవ జ‌రుగుతుంది. తనపై దాడి చేసిన వ్యక్తి ద‌గ్గ‌ర‌కు తిరిగి రావడానికి అసాధారణమైన మార్గాన్ని ఎంచుకుంటాడు. ఉమా మ‌హేశ్వ‌ర రావు ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడో తెర‌పై చూసి తీరాల్సిందే. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు ఇష్ట‌ప‌డేవారికి త‌ప్ప‌క న‌చ్చుతుందీ చిత్రం.

సినిమా బండి :
ప‌ట్ట‌ణ జీవితానికి దూరంగా ఉండే ఓ రిమోట్ విలేజ్ లో జ‌రిగే క‌థ ఇది. కుటుంబ‌బాధ్య‌త‌లు మోస్తున్నో రిక్షా డ్రైవ‌ర్ కు ఖ‌రీదైన కెమెరా దొరుకుతుంది. అయితే ఆ కెమెరాతో సినిమా తీసి ఎలాగైనా బాగా డ‌బ్బులు సంపాదించాలనుకుంటాడు. అందుకోసం ఊళ్లో ఉన్న స్నేహితుల సాయం తీసుకుంటాడు. ఓ అమ్మాయి బ్యాగులో పెట్టి మ‌ర్చిపోయిన కెమెరాతో ఆ రిక్షా డ్రైవ‌ర్ సినిమా ఎలా తీశాడన్న క‌థాంశంతో ఇంట్రెస్టింగ్ గా, ఫ‌న్నీగా సాగే సినిమా బండి మూవీ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకోవ‌డం ప‌క్కా.

అ:

వివిధ ర‌కాల స‌మ‌స్య‌ల‌తో ఉన్న ఆరుగురు వ్య‌క్తులు యాదృచ్ఛికంగా ఒకే రెస్టారెంట్ లో క‌లుస్తారు. ఆ వ్య‌క్తుల మ‌ధ్య మాన‌సిక ఆరోగ్యం, లైంగిక వేధింపులు, డ్ర‌గ్స్ వాడ‌కంతోపాటు ప‌లు సైకాల‌జిక‌ల్, సామాజిక అంశాల చుట్టూ తిరుగుతుందీ సినిమా క‌థ‌. కాజ‌ల్‌, నిత్య‌మీన‌న్‌, రెజీనా క‌సాండ్రా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవ‌స‌రాల త‌మ పాత్ర‌ల్లో లీన‌మై పోయి న‌టించారు. కొత్త‌ద‌నం కోరుకునేవారు ఎంజాయ్ చేయ‌డం ఖాయం.

గేమ్ ఓవ‌ర్:
అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ తెర‌కెక్కించిన థ్రిల్ల‌ర్ హార్ర‌ర్ డ్రామా గేమ్ ఓవ‌ర్‌. గేమ్ డిజైన‌ర్ ఇంట్లోకి సీరియ‌ల్ కిల్ల‌ర్ ప్ర‌వేశించిన త‌ర్వాత ఎలాంటి ఒడిదుడుకులు ఏర్పడ్డాయనేది స్టోరీ. లీడ్ రోల్ స్వ‌ప్న పాత్ర‌లో తాప్సీ ఇంప్రెసివ్ గా క‌నిపిస్తుంది. థ్రిల్ల‌ర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గేమ్ ఓవ‌ర్.

ఇవి కూడా చదవండి..

100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

శ్రియా శరణ్ క‌థ‌క్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో

భర్తతో పబ్లిక్ రొమాన్స్‌..శ్రియ‌పై నెటిజ‌న్ల‌ సెటైర్లు

పాపుల‌ర్ బ్రాండ్ తో ‘అందాల రాక్ష‌సి’ డీల్‌

విడుద‌ల‌కు ముందే ఖ‌ర్చులు వ‌చ్చేశాయి..!

చీర‌లో ఆదాశ‌ర్మ మార్ష‌ల్ ఆర్ట్స్..వీడియో వైర‌ల్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana