Venu Udugula | ‘రాజు Weds రాంబాయి’ మేకర్స్ కొత్త మూవీ.. తెలంగాణ యాసొచ్చినోళ్లకు బంపర్ ఆఫర్!
Raju Weds Rambai Makers | ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నిర్మాణ సంస్థ ఇప్పుడు మరో అర్థవంతమైన, గట్టి సందేశాత్మక చిత్రంతో రాబోతోంది.
Raju Weds Rambai Makers | ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నిర్మాణ సంస్థ ఇప్పుడు మరో అర్థవంతమైన, గట్టి సందేశాత్మక చిత్రంతో రాబోతోంది. విలక్షణ దర్శకుడు వేణు వుడుగుల, సంధ్యా భాను చల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మధుకర్ రెడ్డి కొమిరెడ్డి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఒక యదార్థ గాథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.
భారతీయ కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు, విభేదాలు కొత్తవి కావు గానీ, ఒక ఇల్లు చీలిపోతే కేవలం ఆ కుటుంబమే ఓడిపోతుందా? లేక ఆ ఊరంతా నష్టపోతుందా? అనే ఒక గంభీరమైన ప్రశ్న చుట్టూ ఈ కథ తిరుగుతుంది. “అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్లా ఉండేవారనే రోజులు పోయాయి… ఇప్పుడు రక్తం పంచుకున్నవాళ్లే గొడ్డళ్లు పట్టుకునే మహాభారతం నడుస్తోంది. మా ఊరు జమ్మికుంట మట్టిసాక్షిగా.. ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీ, కేవలం వాళ్ల ఇల్లనే కాదు… మా ఊరి రాతనే మార్చేసింది. అసలు ఆ రోజు ఎవరు గెలిచారో తెలియదు కానీ… ఊరు మాత్రం ఓడిపోయింది. ఇది ఏ ఇంట్లోనూ జరగకూడని కథ. పిల్లలు, పెద్దలు, తాతలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు… అందరూ బయల్దేరండి, ఆ అన్నదమ్ముల పంచాయితీ ఏంటో సూద్దాం.” అని మేకర్స్ ఒక ఎమోషనల్ నోట్ వదిలారు.
మధుకర్ రెడ్డి కొమిరెడ్డి కథ-దర్శకత్వంలో, DSF ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా వస్తున్న ఈ సినిమాలో నటించడానికి చిత్రబృందం నటీనటుల వేట మొదలుపెట్టింది. తెలంగాణ యాస, భాష ముచ్చటగా మాట్లాడటం అచ్చినోళ్లు, నటనపై ఆసక్తి ఉన్న అన్ని వయసుల వారు తమ ఆడిషన్ వీడియోలను పంపించవచ్చని చిత్రబృందం తెలిపింది. ఆసక్తి గలవారు dsf.production02@gmail.com ఇమెయిల్‌కు గానీ, లేదా దర్శకుడు వేణు వుడుగుల వాట్సాప్ నెంబర్ 8096411437కు గానీ తమ వివరాలు పంపాల్సి ఉంటుంది. అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) పంపేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోరని, కేవలం ప్రాపర్ ఆడిషన్ వీడియోలను మాత్రమే పంపించాలని మేకర్స్ స్పష్టం చేశారు.
రాజు Weds రాంబాయి తర్వాత…
మరో అర్థవంతమైన కథతో మీ ముందుకు వస్తున్నాం.భారతీయ కథల్లో అన్నదమ్ముల మధ్య విభేదాలు కొత్తవి కావు.
కానీ ఒక కుటుంబం చీలిపోతే…
నిజంగా ఓడేది ఆ కుటుంబమేనా?
లేక ఆ ఊరంతా?ఆ ప్రశ్న నుంచే పుట్టిన కథే ఇది …!
అన్నదమ్ముల పంచాయితీ. 🔥
ఆ రోజు ఎవరు గెలిచారో… pic.twitter.com/Gx4jj9dHlh
— v e n u u d u g u l a (@venuudugulafilm) June 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

