‘జన నాయగన్’పై దర్శకుడి కీలక వ్యాఖ్యలు
తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్' చిత్రం విడుదలకు కొన్ని నెలలుగా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా జనవరిలోనే రిలీజ్ కావాలి.
తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రం విడుదలకు కొన్ని నెలలుగా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా జనవరిలోనే రిలీజ్ కావాలి. సినిమాలో వివాదాలకు దారితీసే సంభాషణలు, సన్నివేశాలు ఉన్నాయంటూ సెన్సార్‌వారు సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో విడుదలకు బ్రేక్ పడింది. చివరకు ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేకంగా ఏర్పాటైన రివైజింగ్ కమిటీ ఈ సినిమా చూసి, రిపోర్టు ఇవ్వాల్సివుంది. అయితే.. ఈ లోగా ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో హీరో విజయ్ అనూహ్యంగా విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దాంతో ‘జగ నాయగన్’ కష్టాలన్నీ తీరినట్టేనని అంతా భావించారు. కానీ ఇంకా ఈ వ్యవహారం కొలిక్కి రాలేదు. రివైజింగ్ కమిటీ రిపోర్టు కూడా రాలేదు.
ఇదిలావుంటే.. తాజాగా ఓ కార్యక్రమంలో ‘జన నాయగన్’ విడుదల వివాదంపై ఎదురైన ప్రశ్నపై చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ చిత్రానికి సంబంధించిన నిజాల గురించి మాట్లాడే ధైర్యం నాకు లేదు. ఒకవేళ ధైర్యం చేసి నేను మాట్లాడినా.. దాన్ని టెలీకాస్ట్ చేసే ధైర్యం మీకు లేదు. మొత్తంగా సినిమా విడుదల మన చేతుల్లో లేదు..’ అంటూ స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఈ నెల 19నే ‘జగ నాయగన్’ విడుదలవుతుందని అంతా భావించారు. బుక్‌మై షో లాంటి యాప్‌లలో ‘జూన్ 19’ అంటూ డేట్ కూడా వేశారు. కానీ ఇంతలో దర్శకుడు హెచ్.వినోద్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

