Rajamouli: థియేటర్స్ కోసమే సినిమాలు చేస్తానని చెప్పిన రాజమౌళి

కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినిమా రంగానికి చాలా నష్టం వాటిల్లింది. కరోనా వలన చాలా సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పటికీ కొన్ని ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే ఓటీటీలో సినిమాలు విడుదల కావడం విషయంపై రాజమౌళికి ప్రశ్న ఎదురు కాగా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. శుక్రవారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీకి వెళుతుందంటూ వార్తలొచ్చాయి. ‘‘నేను థియేటర్ల కోసమే సినిమాలు తీస్తాను. ఎక్కువమంది ప్రేక్షకులు ఒక్కచోట చేరి ఆస్వాదించే లక్ష్యంగానే నా సినిమాలుంటాయి. అందుచేత థియేటర్లోనే విడుదలవుతాయి. ఎలాంటి సందేహం లేదు’’ అని చెప్పారు రాజమౌళి.
సినిమాల మధ్య క్లాష్ అనేది వ్యాపారంపై ప్రభావం చూపదు. ఒకేసారి నాలుగు చిత్రాలు విడుదలైనా బాగుంటే నాలుగింటిని ప్రేక్షకులు చూస్తారు. జనవరిలో చాలా చిత్రాలొస్తున్నాయి. అన్ని చిత్రాలు బాగా ఆడి, మంచి వసూళ్లు రాబట్టి ప్రేక్షకులకు వినోదం పంచాలని కోరుకుంటున్నా’’అన్నారు. ‘‘నాకు ఈ భాష నటులు, ఆ భాష నటులు అని భేదాలు ఏమీ లేవు. నా కథ, స్క్రిప్ట్‌కు ఎవరూ సరిపోతారు చూసుకొని వారినే సంప్రదిస్తాను. ‘బాహుబలి’ అనే సినిమాను ఉపయోగించుకొని ఎవరి దగ్గరికి వెళ్లను. నా స్క్రిప్ట్‌ను నమ్ముకొనే నేను ముందుకు వెళుతుంటా’’ అని చెప్పుకొచ్చారు.
ముంబైలో జరిగిన ‘పీవీఆర్ఆర్ఆర్’ లోగో ఆవిష్కరణకు హాజరైన రాజమౌళి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ‘పీవీఆర్ఆర్ఆర్’ లోగో కొనసాగనుందని ఆయన స్పష్టంచేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

