బాబోయ్ ఇది ఊర నాటు.. మాస్ డాన్సులతో కుమ్మేసిన చరణ్, ఎన్టీఆర్..

RRR Mass Anthem Naatu Naatu song | RRR సినిమా అధికారికంగా ప్రకటించిన రోజు నుంచి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ను ఒకే స్క్రీన్‌పై కలిపి చూడాలని అభిమానులు తహతహలాడుతున్నారు. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన చాలా విజువల్స్ బయటకు వచ్చాయి.. కానీ ఇద్దరు కలిసి ఉన్న విజువల్స్ మాత్రం రాలేదు. ఒకసారి రామ్ చరణ్.. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ఇలా వేర్వేరు విజువల్స్ విడుదల చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. కానీ సినిమా విడుదల తేదీ దగ్గరికి వస్తుండటంతో ప్రమోషన్ లో కూడా జోరు పెరిగింది. తాజాగా ఈ సినిమాలో ఊరమాస్ సాంగ్ విడుదల చేశారు. నాటు నాటు అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రచించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి పాడిన ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన క్షణం నుంచి సంచలనం సృష్టిస్తోంది.
లిరిక్స్ గురించి మర్చిపోండి.. పాట గురించి మర్చిపోండి.. మ్యూజిక్ గురించి మర్చిపోండి.. ఇద్దరూ గ్రేట్ డాన్సర్స్ కలిసి స్క్రీన్ మీద స్టెప్పులు వేస్తుంటే అది కదా మాకు కావాల్సింది అంటూ అభిమానులు పొంగిపోతున్నారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో వస్తున్న ఈ సాంగ్ లో చరణ్, తారక్ డాన్సులకు సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవడం ఖాయం. ముఖ్యంగా ఇప్పుడు విడుదలైన లిరికల్ సాంగ్ లో రెండు స్టెప్పులు అభిమానుల కోసం చూపించాడు రాజమౌళి. అది చూసిన తర్వాత సినిమాలో సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో క్లారిటీ వచ్చేసింది.

అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఈ పాట రేంజ్ మారిపోయింది. కీరవాణి మరోసారి మాస్ ట్యూన్ ఇచ్చాడు. రేపు సినిమాలో ఈ పాట చూస్తున్నప్పుడు థియేటర్స్ అన్నీ ఈలలు గోలలతో మార్మోగిపోవడం ఖాయం. జనవరి 7, 2022న సంక్రాంతి కానుకగా త్రిబుల్ ఆర్ సినిమా విడుదల కానుంది. హిందీలో ఈ సినిమా రైట్స్ పెన్ సినిమాస్ సొంతం చేసుకుంది. కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే కాకుండా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా పెన్ సినిమాస్ దక్కించుకుంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
RRR: షూట్ గ్యాప్‌లో చిల్ అవుతున్న మాస్ కా మాస్టర్స్
Alia bhatt | అమ్మో రెండేండ్లలో ఆలియాభట్ అంత సంపాదించిందా?
Rajamouli | పవన్ కళ్యాణ్‌తో సినిమాపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rajamouli: థియేటర్స్ కోసమే సినిమాలు చేస్తానని చెప్పిన రాజమౌళి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

