RRR: షూట్ గ్యాప్‌లో చిల్ అవుతున్న మాస్ కా మాస్టర్స్

టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్.. పెన్ స్టూడియోస్.. లైకా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.జనవరి 7న సినిమా విడుదల కానుండగా, మూవీకి సంబంధించి జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి విడుదలైన దోస్తీ పాటకు మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు రెండో పాటను విడుదల చేయబోతున్నారు. నిన్న ప్రోమో విడుదల చేయగా, ఇందులో ఇద్దరు హీరోలకు సంబంధించి కొన్ని ఫొటోలు చూపించారు. తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ మాస్ యాంథమ్ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కానుందని తెలియజేస్తూ ఎన్టీఆర్,రామ్ చరణ్ పిక్ ఒకటి విడుదల చేశారు.
షూటింగ్ గ్యాప్‌లో చరణ్, ఎన్టీఆర్ చిల్ అవుతున్నట్టు కనిపిస్తుండగా పిక్ ఆకట్టుకుంటుంది. ఇక “నాటు నాటు” ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రబోస్ రాసిన పాటకు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవా పాడారు.ఎంఎం కీరవాణి స్వరాలు అందించిన ఈ సాంగ్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- ram charan
- RRR
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

