keeravani remuneration | ట్రిపుల్ ఆర్ కోసం కీరవాణి అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
కీరవాణి రెమ్యునరేషన్ | కీరవాణి రెమ్యునరేషన్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఆయన తీసుకుంటున్న పారితోషికం గురించి తెలిసి చాలామంది షాకవుతున్నారు.

keeravani remuneration | టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు కీరవాణి. 1990ల్లో మ్యూజిక్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించిన కీరవాణి ఇప్పటికీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తనతోపాటు కెరీర్ మొదలుపెట్టిన సంగీత దర్శకులు ఎంతోమంది సినిమాలకు దూరమవుతున్నా.. ఈయన మాత్రం అప్రతిహాసంగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగుస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాలకు సంగీతం అందిస్తూ టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా.. కాదు కాదు.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. బాహుబలి సినిమాకు ఆయన అందించిన బాణీలు ప్రపంచమంతా వైరల్ అయ్యాయి.. పలు దేశాల సంగీత కచేరీల్లోనూ ఈ పాటలు మార్మోగాయంటే.. కీరవాణి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ఇప్పుడు కీరవాణి రెమ్యునరేషన్ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం ఆయన తీసుకుంటున్న పారితోషికం గురించి తెలిసి చాలామంది షాకవుతున్నారు.

శాస్త్రీయ సంగీతంలో దిట్ట అయిన కీరవాణి కేవలం ఒక్క జోనర్‌కే పరిమితం కాలేదు. అన్ని జోనర్లలోనూ బాణీలు అందిస్తూ సత్తా చాటుతున్నాడు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటికి దాదాపు 150 సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న కీరవాణి.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ సినిమాకు కూడా కీరవాణినే సంగీతం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం కీరవాణి ఏకంగా రూ.18 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో కీరవాణినే చెప్పాలి.
ట్రిపుల్ఆర్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు, కె. రాఘవేంద్రరావు పెళ్లి సందడి సినిమాలకు కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే బలమెవ్వడు సినిమాలో కీరవాణి ఒక పాట కూడా పాడాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 20 ఏళ్ల కిందట మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఎన్టీఆర్ సినిమా సుబ్బులో కీరవాణి పాట పాడాడు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ సినిమా కోసం ఈ ఇద్దరు కలిసి పనిచేశారు. బలమెవ్వడు కరి బ్రోవను.. అనే సాగే ఈ పాటను కీరవాణి అద్భుతంగా ఆలపించారు. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. మరి ఆచార్య, పుష్ప పరిస్థితేంటి?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

