సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. మరి ఆచార్య, పుష్ప పరిస్థితేంటి?
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు.. కానీ అప్పుడే మన సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేసి కూర్చుంటున్నారు స్టార్ హీరోలు.

కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదు.. కానీ అప్పుడే మన సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం వరుసగా అనౌన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది సంక్రాంతి కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫ్ వేసి కూర్చుంటున్నారు స్టార్ హీరోలు. 2022 సంక్రాంతికి 5 సినిమాల పోటీ పడుతున్నాయి. అందులో మహేశ్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి మల్టీస్టారర్, ప్రభాస్ రాధే శ్యామ్, వెంకటేశ్ ఎఫ్ 3 సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమాల విడుదల తేదీలన్నీ కేవలం రెండు రోజుల గ్యాప్ లోనే ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పటి వరకు రాబోయే పెద్ద సినిమాల విడుదల తేదీలు కన్ఫర్మ్ అయ్యాయి.
రాజమౌళి ట్రిపుల్ ఆర్ కూడా అక్టోబర్ 13న విడుదల కానుంది అంటూ మరోసారి అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్ర యూనిట్. ఆగస్టు 1న స్నేహితుల దినోత్సవం కానుకగా సినిమాలోని దోస్తీ అనే పాటను కూడా విడుదల చేశారు. ఇదంతా ఇలా ఉంటే రెండు సినిమాల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఇంకా ప్రేక్షకులకు క్లారిటీ రాలేదు. అవే చిరంజీవి ఆచార్య, అల్లు అర్జున్ పుష్ప. ఈ రెండు సినిమాల విడుదల తేదీలు ఇంకా కన్ఫార్మ్ కాలేదు. చిరంజీవి ఆచార్య షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. దీని కోసం ప్రత్యేకంగా వేసిన టెంపుల్ సెట్లో షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాను ముందు దసరాకు విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ అప్పుడు రాజమౌళి సినిమా ఉండటంతో మళ్లీ ఆలోచనలో పడిపోయారు మేకర్స్.
ఇక అల్లు అర్జున్ పుష్ప విషయంలో కూడా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది అంటూ మొన్నటివరకు ప్రచారం జరిగింది. కానీ ఎన్ని సినిమాలు ఒకేసారి వస్తుండడంతో పండక్కి పుష్ప రంగంలోకి దిగుతాడా లేదా అనేది అనుమానమే. దాంతో పుష్ప మొదటి భాగం విడుదల తేదీపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఈ రెండు సినిమాలు కూడా రిలీజ్ డేట్స్ కన్ఫార్మ్ చేసుకుంటే ఒక నిండుదనం వస్తుంది. మెగా అభిమానులు కూడా ఈ రెండు సినిమాల విడుదల తేదీల కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sai Pallavi Tamil | కోలీవుడ్ కమ్‌బ్యాక్ కు సాయి పల్లవి ప్లాన్..?
Sanjana galrani | పెళ్లయిన ఏడాదిలోపే విడాకులు తీసుకుంటున్న ప్రభాస్ హీరోయిన్ ?
కైలాస మానస సరోవర్ యాత్రకు ఉపాసన కొణిదెల ?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Samantha | అభిమానులకు షాక్.. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసిన సమంత
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మూడు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

