Prabhas ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మూడు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలు
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ | జనవరి 14న రాధేశ్యామ్ విడుదల అవుతుంటే.. ఏప్రిల్ 14న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ రిలీజ్ కానుంది.

Radhe shyam | ఇంతకంటే ప్రభాస్ అభిమానులకు కావాల్సింది ఏం లేదు. ఎందుకంటే మూడేళ్లుగా ఆయన నుంచి సినిమాలు రావడం లేదని అభిమానులు తెగ ఫీలవుతున్నారు. అలాంటి వాళ్లకు మూడు నెలల్లో రెండు సినిమాలతో దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు త్వరగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించిన అఫిషియల్ పోస్టర్ కూడా విడుదలైంది. చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు ప్రభాస్. ఈయనకు సంక్రాంతి పండుగ బాగానే కలిసొచ్చింది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ వర్షం సినిమా 2004 సంక్రాంతికి విడుదలైంది. ఆ తర్వాత యోగి కూడా అదే పండక్కి వచ్చినా అంచనాలు అందుకోలేకపోయింది.
ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్యూర్ లవ్ స్టోరీలా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది. దాదాపు రూ.140 కోట్ల బడ్జెట్‌తో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా వచ్చిన తర్వాత సరిగ్గా మూడు నెలల్లో మరో సినిమాతో ప్రభాస్ రానున్నాడు. జనవరి 14న రాధేశ్యామ్ విడుదల అవుతుంటే.. ఏప్రిల్ 14న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ రిలీజ్ కానుంది. అంటే సరిగ్గా 90 రోజుల వ్యవధిలో రెండో సినిమా కూడా రానుంది. అన్నీ కుదిరితే 2022లోనే మరో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అదే ఆదిపురుష్. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. మొత్తానికి 2022లో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సర్కారు వారి పాటలో మహేశ్ లుక్ వచ్చేసింది.. సూపర్ స్టార్ బర్త్ డేకి మరో బ్లాస్టర్
నారప్ప సక్సెస్‌మీట్‌లో నోరు జారిన వెంకటేశ్.. ఎఫ్ 3 విడుదలపై క్లారిటీ
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
Samantha | అభిమానులకు షాక్.. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసిన సమంత
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

