e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News Thimmarusu Movie Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..

Thimmarusu Movie Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..

Thimmarusu Movie Review

Thimmarusu Movie Review : లాక్‌డౌన్‌ 2.0 అనంతరం నాలుగు నెలల విరామం తర్వాత తెలుగు నాట థియేటర్స్‌లో సినిమాల సందడి మొదలైంది. కరోనా ఉధృతితో ఏప్రిల్‌ నెలలో థియేటర్స్‌ మూతపడ్డాయి. సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రేక్షకులు గతంలో మాదిరిగా థియేటర్స్‌కు వస్తారా?లేదా? అనే సంశయాలు నెలకొన్న నేపథ్యంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ శుక్రవారం పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటితో తిమ్మరుసు ఒకటి. సత్యదేవ్‌ హీరోగా నటించిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కన్నడంలో విజయవంతమైన ‘బీర్బల్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. మహేష్‌ కోనేరు, సృజన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెకండ్‌వేవ్‌ తర్వాత థియేటర్‌లో విడుదలైన ఈ తొలి సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుంది. కెరీర్‌ తొలిసారి లాయర్‌ పాత్రలో నటించిన సత్యదేవ్‌ ప్రేక్షకుల్ని మెప్పించాడా?అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…

క‌థ‌

రామచంద్రం అలియాస్‌ రామ్‌(సత్యదేవ్‌) నిజాయితీపరుడైన లాయర్‌. పెద్ద కేసును ఛేదించి న్యాయవాదిగా తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఉంటాడు. సామాన్యులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఓ కార్పొరేట్‌ సంస్థ కొత్తగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. అందులో ఉద్యోగిగా చేరిన రామ్‌ 2011లో జరిగిన క్యాబ్‌ డ్రైవర్‌ హత్యకు సంబంధించిన నష్టపరిహారం కేసు చేపడతాడు. ఆ కేసు శోధనలో హంతకుడిగా ముద్రపడి జైలు శిక్షను అనుభవిస్తున్న వాసు(అంకిత్‌) నిరపరాధి అనే నిజాన్ని రామ్‌ తెలుసుకుంటాడు. ఈ కేసును రీఓపెన్‌ చేయించిన రామ్‌కు ప్రత్యర్థుల నుంచి అడుగడుగున అడ్డంకులు ఎదురవుతుంటాయి. ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ వెళ్లిన రామ్‌ అసలు హంతకుడిని ఎలా పట్టుకోగలిగాడు?రామ్‌ ఈ కేసును చేపట్టడానికి కారణమేమిటి? చనిపోయిన క్యాబ్‌ డ్రైవర్‌తో అతడికి ఉన్న సంబంధమేమిటి? కేసు శోధనలో రామ్‌కు అను(ప్రియాంక జవాల్కర్‌), సుధాకర్‌(బ్రహ్మాజీ) ఎలాంటి సహాయం చేశారన్నది ఈ చిత్ర ఇతివృత్తం.

ఎలా ఉంది?

- Advertisement -

కన్నడంలో విజయవంతమైన ‘బీర్బల్‌’ ఆధారంగా రూపొందిన మర్డర్‌ మిస్టరీ చిత్రమిది. తాను చేయని నేరానికి గాను జైలు శిక్షను అనుభవిస్తున్న ఓ అమాయక యువకుడి కాపాడే లాయర్‌ కథకు హీరోయిజం, ప్రేమ లాంటి హంగుల్ని జోడిస్తూ దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. సాధారణంగా మర్డర్‌ మిస్టరీ సినిమాల విజయావకాశాలు హీరో విలన్‌ ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో ఆధారపడి ఉంటాయి. స్క్రీన్‌ప్లేతో పాటు మలుపుల్ని పకడ్బందీగా రాసుకోవడం ముఖ్యం. ఆ విషయంలో దర్శకుడు విజయవంతమైయ్యారు. విలన్‌ ఎవరనేది చివరి నిమిషం వరకు ప్రేక్షకుల ఊహలకు అందకుండా కథనాన్ని ఉత్కంఠభరితంగా నడిపించారు.

పెద్ద కేసును చేపట్టాలనే తపన కలిగిన లాయర్‌గా సత్యదేవ్‌ పాత్రను పరిచయం చేసే సన్నివేశాలతో వినోదాత్మకంగా కథను మొదలుపెట్టారు దర్శకుడు. వాసు కేసును రామ్‌ స్వీకరించడంతో కథాగమనంలో వేగం పెరుగుతుంది. సాక్ష్యాల్ని సేకరించే సన్నివేశాలతో ప్రథమార్థాన్ని నడిపిస్తూ వెళ్లారు. తన తెలివితేటలతో హీరో సేకరించిన సాక్ష్యాల్ని విలన్‌ల చేతికి చిక్కే ఎపిసోడ్స్‌తో ద్వితీయార్థం పోటాపోటీగాసాగింది. పతాక ఘట్టాల ముందు వచ్చే మలుపు ఆకట్టుకుంటుంది. చనిపోయిన క్యాబ్‌ డ్రైవర్‌తో హీరోకు ఉన్న అనుబంధం ఏమిటి? వృత్తిపరమైన బాధ్యతతో పాటు వ్యక్తిగతంగా తన ప్రతీకారాన్ని రామ్‌ ఎలా తీర్చుకున్నాడనే పాయింట్‌ను చక్కగా చూపించారు. రీమేక్‌కు అనవసరపు కమర్షియల్‌ హంగుల్ని జోడించకుండా చెడగొట్టకుండా నిజాయితీగా తెలుగులో తెరకెక్కించారు. పాటల జోలికి వెళ్లలేదు. ప్రత్యేకంగా కమెడియన్స్‌ను తీసుకోకుండా కథానుగుణంగానే బ్రహ్మజీ పాత్రతో వినోదాన్ని పండించారు. ఈ తరహా మర్డర్‌ మిస్టరీ సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. కథలో కొత్తదనం లోపించింది. హీరో ఆధారాల్ని సేకరించే సన్నివేశాల్లో ఆసక్తి తగ్గింది. వాటిని మరింత గ్రిప్పింగ్‌గా రాసుకుంటే బాగుండేది.

ఎవ‌రెలా చేశారు

విలక్షణ పాత్రలతో తెలుగు చిత్రసీమలో వెర్సటైల్‌ యాక్టర్‌గా సత్యదేవ్‌ గుర్తింపును సొంతం చేసుకున్నారు. గత చిత్రాలకు భిన్నంగా ఇందులో లాయర్‌గా తనదైన శైలి నటనతో మెప్పించారు. కమర్షియల్‌ పంథాలో హీరోయిజాన్ని మేళవిస్తూ ఆయన పాత్రను దర్శకుడు వినూత్నంగా తీర్చిదిద్దారు. ప్రేమ, బాధ్యతలకు మధ్య సంఘర్షణలోనయ్యే న్యాయవాదిగా, అమాయకుడు శిక్షింపబడకూడదనే నమ్మే బాధ్యతయుతమైన వ్యక్తిగా పలు పార్శాల్ని ఆవిష్కరిస్తూ సెటిల్డ్‌గా సత్యదేవ్‌ నటించాడు. ప్రియాంక జవాల్కర్‌ పాత్రకు అంతగా ప్రాధాన్యతనివ్వలేదు. బ్రహ్మాజీ తన కామెడీ టైమింగ్‌ నవ్వించారు. చేయని నేరానికి శిక్షను అనుభవించే యువకుడిగా వాసు సహజ నటనతో ఆకట్టుకున్నాడు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉంది

దర్శకుడిగానే కాకుండా సంభాషణల రచయితగా శరణ్‌ కొప్పిశెట్టి ప్రతిభను చాటుకున్నారు. సత్యదేవ్‌ పాత్ర నేపథ్యంలో వచ్చే ప్రతి డైలాగ్‌ ఆకట్టుకుంటుంది. కథలోని థ్రిల్లింగ్‌ ఫీల్‌ను ఎలివేట్‌ చేస్తూ శ్రీచరణ్‌ పాకాల చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్ని ఈ సినిమా మెప్పిస్తుంది. చాలా రోజులుగా థియేటర్‌లో సినిమా చూసే అనుభూతికి దూరమైన తెలుగు ప్రేక్షకుల్ని కొంత వరకు ఈ సినిమా థ్రిల్‌ను పంచుతుంది.

రేటింగ్‌-2.75/5

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

సిల్క్ స్మిత‌ను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి..

దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామ‌లు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana