నారప్ప సక్సెస్‌మీట్‌లో నోరు జారిన వెంకటేశ్.. ఎఫ్ 3 విడుదలపై క్లారిటీ
సంక్రాంతి బరిలో ఎఫ్ 3 | దసరా బరిలో ఈ సినిమా ఉంది అని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వెంకటేశ్ నోరు జారడంతో ఎఫ్ 3 విడుదల తేదీపై కన్ఫర్మేషన్ వచ్చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

సినిమా ఇండస్ట్రీలో అన్నింటికంటే ఎక్కువగా నమ్మేది సెంటిమెంట్ ! ఒకసారి కలిసి వస్తే దాన్ని అసలు వదిలిపెట్టరు. ఒకవేళ కలిసిరాకపోతే దాని జోలికి మరోసారి వెళ్లరు. ఇప్పుడు ఎఫ్ 3 సినిమా విషయంలో అనిల్ రావిపూడి కూడా ఇదే చేస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయాలని ముందు అనుకున్నారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆరు నెలలకు పైగా వాయిదా పడింది. ప్రస్తుతానికి షూటింగ్ వేగంగా జరుగుతోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్, మెహ్రీన్, తమన్నా అందరూ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీపై మొన్నటి వరకు ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఎప్పుడు విడుదల అవుతుందో తెలియకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దసరా బరిలో ఈ సినిమా ఉంది అని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా వెంకటేశ్ నోరు జారడంతో ఎఫ్ 3 విడుదల తేదీపై కన్ఫర్మేషన్ వచ్చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
సరిగ్గా మూడేళ్ల కిందట సంక్రాంతికి ఎఫ్ 2 సినిమా వచ్చింది. వినయ విధేయ రామ, దర్బార్, ఎన్టీఆర్ బయోపిక్ లాంటి భారీ సినిమాలతో పోటీపడుతూ అందర్నీ ఓడించి సోలో విన్నర్‌గా నిలిచింది ఎఫ్ 2. ఎంటర్టైన్మెంట్ ప్రధాన ఆయుధంగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపు 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇప్పుడు కూడా సంక్రాంతి బరిలోనే ఎఫ్ 3 సినిమాను దించుతున్నారు. నారప్ప సక్సెస్ మీట్లో వెంకటేశ్ ఈ సినిమా గురించి ఓపెన్ అయ్యాడు. పైగా అక్కడే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు.
‘ నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేసినందుకు అభిమానులు క్షమించాలి. ఎఫ్ 3 మాత్రం థియేటర్లోనే రిలీజ్ చేస్తాం. పండుగ సీజన్లో ఫన్ పంచుతాం. అది మామూలుగా ఉండదంటూ’ చెప్పుకొచ్చాడు. దీంతో వచ్చే సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని క్లారిటీ వచ్చేసింది. 2022 సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా, మహేష్ బాబు సర్కారు వారి పాట, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలు పోటీ పడుతున్నాయి. వాటితో పాటు ఎఫ్ 3 కూడా దండయాత్రకు సిద్ధమవుతోంది. మరోసారి సైలెంట్ కిల్లర్ గానే బరిలోకి దిగుతుంది ఈ సినిమా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సర్కారు వారి పాటలో మహేశ్ లుక్ వచ్చేసింది.. సూపర్ స్టార్ బర్త్ డేకి మరో బ్లాస్టర్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

