Akkineni Samantha | పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్‌లో కొనసాగుతోంది సమంత. దాదాపు పదేళ్లుగా టాలీవుడ్లో చక్రం తిప్పుతోంది. పెళ్లికి ముందు వరకు గ్లామర్ రోల్స్‌లో కనిపించిన సామ్.. అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత సెలెక్టివ్ పాత్రలతో ముందుకెళ్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత.. ఇప్పుడు చేసిన ఒక పని అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. తన సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు తర్వాత ఉన్న అక్కినేని ఇంటి పేరును తొలగించింది.
నాగచైతన్య ( Nagachaitanya ) ను ప్రేమించి 2017లో పెళ్లి చేసుకుంది సమంత. ఆ వెంటనే తన పేరు వెనకాల అక్కినేని అని చేర్చేసుకుంది. సోషల్ మీడియాలో అప్పటిదాకా సమంత రుతు ప్రభు అని ఉన్న పేరును కాస్త సమంత అక్కినేని అని మార్చేసింది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. సమంతపై అప్పట్లో తెగ ప్రశంసలు కురిపించారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అదే పేరును ఉంచారు. అయితే ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి తన పేరులో అక్కినేని ఇంటి పేరును తొలగించింది. ట్విటర్లో కేవలం ఎస్ అనే పదాన్ని మాత్రమే ఉంచింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాగచైతన్య, సమంత మధ్య ఏమైనా జరిగిందా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సామ్ అభిమానులు మాత్రం దీనిపై మరోలా వాదిస్తున్నారు. ఆమె తాజాగా నటిస్తున్న శాకుంతలం సినిమా పేరుతో ఎస్ అనే అక్షరం పెట్టి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సమంత తన ఇష్టప్రకారం పేరు మార్చుకుంటే మీకొచ్చిన సమస్య ఏంటి? ఈ విషయాన్ని అంత పెద్దది చేసి భూతద్దంలో చూడాలా అని ప్రశ్నిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో పేరు మార్పు వెనుక కారణమేంటో సమంతనే చెప్పే దాకా ఈ చర్చ ఆగేలా లేదు మరి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు