పవన్ కళ్యాణ్‌తో నితిన్ పోటీ.. తెలిసి చేశాడా.. తెలియక చేశాడా..?

pawan kalyan vs nithiin | బయట మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్‌కు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇంకా మాట్లాడితే ఇండస్ట్రీలో ఆయనకు భక్తులు ఉన్నారు. అందులో నెంబర్ వన్ ఎప్పుడూ బండ్ల గణేశ్ ఉంటాడు. ఆ తర్వాత నితిన్ కేరాఫ్ పవన్ అన్నట్టే ఉంటాడు. మెగా హీరోల కంటే కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తన సినిమాల కోసం వాడుకుంటాడు నితిన్. మరోవైపు నితిన్ ఏం చేసినా తనకు ఇష్టమే అంటూ పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానిపై ప్రేమ కురిపిస్తూ ఉంటాడు. ఆ మధ్య తనే నిర్మాతగా మారి నితిన్ హీరోగా ఛల్ మోహన్ రంగా సినిమా కూడా నిర్మించాడు పవన్ కళ్యాణ్. ఇద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. అలాంటి తన అభిమాన హీరోతో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నాడు నితిన్. తెలిసి ప్రకటించాడో లేదంటే అనుకోకుండా అలా జరిగిపోయిందో తెలియదు గానీ.. పవన్ సినిమా విడుదల రోజే తన సినిమా కూడా విడుదల అవుతుంది అంటూ పోస్టర్ విడుదల చేశాడు.

నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో కొత్త దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న మాచర్ల నియోజకవర్గం ( Macherla Niyojakavargam ) కూడా ఉంది. మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాను చేస్తున్నాడు నితిన్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో ఎన్నికల ఆఫీసర్‌గా నితిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను ఏప్రిల్ 29, 2022న విడుదల చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే రోజు పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు ( Hari Hara Veera Mallu ) సినిమా కూడా విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చాలా రోజుల కింద వచ్చింది. సీనియర్ నిర్మాత ఏ.ఎం రత్నం దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ వస్తున్న రోజే నితిన్ సినిమా కూడా వస్తుందని అధికారిక ప్రకటన రావడం అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. చివరి వరకూ రేసులో ఉంటాడా లేదంటే పవన్ వస్తున్న విషయం తెలుసుకుని సైలెంట్‌గా సైడ్ ఇస్తాడా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో భారీగా మార్పులు.. కోట్లల్లో హక్కులు..
Pawan kalyan | సాయి ధరమ్ తేజ్ దర్శకుడికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్
Pawan : పవన్ సినిమాతో అకీరా నందన్ టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడా..!
Pawan Kalyan Condition | అనిల్ రావిపూడికి షరతు పెట్టిన పవన్‌కల్యాణ్..?
Pooja Hegde Call Sheets | పవన్ సినిమా..క్లారిటీ కోసం పూజాహెగ్డే వెయిటింగ్..!
Macherla Niyojakavargam | మొన్న సాయి ధరమ్ తేజ్.. ఇప్పుడు నితిన్ !!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

