Pawan kalyan | సాయి ధరమ్ తేజ్ దర్శకుడికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్

Power star Pawan kalyan |పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ దర్శకుడికి అవకాశం ఇస్తాడో ఊహించడం కష్టం. కథ నచ్చితే హిట్స్‌తో సంబంధం లేకుండా దర్శకులకు అవకాశం ఇస్తుంటారు. ఇది ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అంతెందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు చాలా వరకు ఫ్లాప్ దర్శకులే పనిచేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న భీమ్లా నాయక్ ( Bheemla nayak ) సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకుడు. ఈయన కెరీర్లో ఇప్పటివరకు విజయం లేదు. అలాగే ఎన్టీఆర్ ( NTR ) బయోపిక్‌తో డిజాస్టర్ ఇచ్చిన క్రిష్ ( Krish ) దర్శకత్వంలో హరిహర వీరమల్లు ( hari hara veeramallu ) సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. కథ నచ్చిందంటే చాలు.. దర్శకుల గత సినిమాల రిజల్ట్‌ను పట్టించుకోకుండా అవకాశాలు ఇవ్వడంలో పవన్ కళ్యాణ్ అందరికంటే ముందుంటాడు. ఇప్పటికే సాగర్ కే చంద్ర, క్రిష్‌తో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్.. తాజాగా మరో ఫ్లాప్ దర్శకుడికి కూడా పవన్ అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు దేవా కట్టా ( Deva katta ).
సాయి ధరమ్ తేజ్ ( Sai dharam tej ) హీరోగా ఈ మధ్య రిపబ్లిక్ ( Republic ) సినిమా చేశాడు. సామాజిక నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు దేవా కట్టా. సినిమా కమర్షియల్‌గా విజయం సాధించిందా లేదా అనే విషయం పక్కన పెడితే.. ఈ సినిమాకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖులు కూడా రిపబ్లిక్ సినిమా చూసి తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఒక అద్భుతమైన కథను ప్రేక్షకులకు దేవా కట్టా అందించాడు అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఫిదా అయిపోయాడు. తనతో ఒక సినిమా చేయాలి అంటూ దేవాకట్టా అడిగినట్లు తెలుస్తోంది. మంచి కథ ఉంటే కలిసి పని చేద్దామని ఆయనకు మాట ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నుంచి ఊహించని అవకాశం రావడంతో దేవా కట్టా కూడా ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నాడు. పవన్ ఇమేజ్‌కు సరిపోయేటట్లు సామాజిక అంశాలను స్పృశిస్తూ.. కమర్షియల్ అంశాలు ఉండేలా కథ సిద్ధం చేస్తున్నాడు దేవా కట్టా. త్వరలోనే ఈ సినిమాపై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అయినా ఇప్పుడు పవన్‌తో సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మరో రెండేళ్ల వరకూ డేట్స్ బిజీగా ఉన్నాయి. వాటిని దాటుకొని దేవా కట్టా – పవన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలంటే చాలా సమయం పడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha | ఎన్టీఆర్ తో సమంత సందడి ..క్రేజీ అప్ డేట్..!
Bheemla Nayak: భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ దూకుడుకి షాక్ అవుతున్న సినీ వర్గాలు
Samantha: పెళ్లి రోజు పోస్ట్ పెట్టిన సమంత.. అందులో ఏం చెప్పిందంటే..!
షారూఖ్ పార్టీలో బాలీవుడ్ స్టార్ల భార్యలు డ్రగ్స్ తీసుకున్నారు: షెర్లిన్ చోప్రా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

